ప్రపంచం కల నెరవేరబోతోంది.. త్వరలో కారులోనే ఎగిరి పోవచ్చు..?
అయితే ఇలా రోడ్డుపై దూసుకుపోయే కారునే విమానంలా తయారుచేయడానికి పరిశోధకులు ఎన్నో రోజుల నుంచి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే పరిశోధకులు శ్రమకు ఫలితం దక్కింది. ఏకంగా రోడ్డుపై కారు లా దూసుకు పోవడమే కాదు నిమిషాల వ్యవధిలో విమానం గా మారిపోయి గాలిలో కూడా దూసుకుపోయే సరికొత్త ఆవిష్కరణ తెరమీదికి వచ్చింది అన్న విషయం తెలిసిందే. గతంలోనే ఇక ఇలాంటి కారుకు సంబంధించిన వీడియో ఒకటి విడుదల అయ్యింది. అయితే ప్రపంచ ప్రజానీకం మొత్తం ఇక ఈ కార్ కం విమానానికి ఎప్పుడు అనుమతి వస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గత కొన్ని నెలల క్రితం ఇలా రోడ్డుపై దూసుకుపోయి నిమిషాల వ్యవధిలో విమానం గా మారే కార్ ఆవిష్కరణ జరగగా.. ఇటీవలే అనుమతులు కూడా వచ్చేస్తాయి. పదివేల అడుగుల ఎత్తులో గంటకు వంద మైళ్ళ వేగంతో ఈ కార్ దూసుకుపోతుంది. ఇక ఈ కారుకు అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ ఆధారిటీ అనుమతులు జారీ చేసింది. రెండు సీట్ల సామర్థ్యం తో ఉన్న ఈ కారును వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదల చేసేందుకు కసరత్తు మొదలు అయ్యాయి. కాగా ప్రస్తుతం ఈ కారులో కేవలం ఫ్లైట్ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉండడం గమనార్హం. అయితే కేవలం ఒక్క నిమిషం వ్యవధిలోనే కారు నుంచి విమానంలో మారిపోతుంది ఈ సరికొత్త ఆవిష్కరణలు.