వైసీపీ ఎంపీ రఘురామరాజు జగనోరికి మేకై కుర్చున్నారుగా...?
అమిత్ షా ను కలిసిన ఆయన అమరావతి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని కోరినట్లు తెలిసింది. దీనికి ఒకింత ఆశ్చర్యమనిపించినా పేరుకే ఈయన వైసీపీ ఎంపీ, తన సపోర్ట్ అంతా ప్రహి పక్ష పార్టీలకే అని తెలిసిందే. అనంతరం మోడీతో భేటీ అయిన రఘు రామ ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ వంటి కీలక అంశాల గురించి ప్రస్తావించినట్లు సమాచారం. ఇవన్నీ ఒక ఎత్తయితే... ఓ విషయం విని ప్రధాని మోడీ షాక్ అయ్యారట. ఏపీలో చర్చిల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను పిలిచిందని రఘురామ చెప్పగానే, ప్రధాని మోదీ ఆశ్చర్యానికి గురయ్యారట...దీనిపై అయన మాట్లాడుతూ చర్చిల నిర్మాణానికి టెండర్లా...? అని నవ్వారట...!
అంతే కాదు అందుకు సంబంధించిన వివరాలను అందించాలని సూచించారట ప్రధాని. చర్చిల నిర్మాణం కొరకు టెండర్లు అంటే నిజంగా ఆశ్చర్య దగ్గ విషయమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.... మరి ఇంతకీ అది ఏ సందర్భమో... కారణమేంటో అన్నది తెలియాల్సి ఉంది. రఘురా కృష్ణకు వేరే పనిలేదు, అవకాశం దొరికితే చాలు అధికార పార్టీని ఇరికించే పనిలోనే ఉంటారు అని వైసీపీ నాయకులు అంటూ ఉన్నారు. మరి మోదీ దీనిపై ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో చూడాలి. పైగా జగన్ ఈ మాటలను కనీసం పట్టించుకోలేదంటే నమ్మండి.