రేషన్ సరకుల రేట్లు పెంచేస్తారా..?
ఈ సందర్భంగా కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ రేషన్ సరకుల రేట్ల పెంపుపై స్పందించారు. ఆన్ లైన్ ద్వారా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి రేషన్ సరకుల రేట్లు పెంచే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. రేషన్ సరకులపై భారం మోపితే ప్రజలు ఇబ్బందులు పడతారని, అందుకే కేంద్రం అలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ప్రజలెవరూ అపోహలు పెట్టుకోవద్దని, కేంద్రం సబ్సిడీపై ఇచ్చే రేషన్ సరకులు యథావిధిగానే కొనసాగుతాయని అన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్గత సబ్సిడీని కొనసాగిస్తుండటంతో.. ఏ రాష్ట్రంలో కూడా రేషన్ సరకుల రేట్లు పెరిగే అవకాశం లేదని తేలిపోయింది.
రేషన్ కార్డు పోర్టబిలిటీపై కూడా మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. రెండేళ్ల క్రితం ప్రారంభించిన ‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు’ పథకం 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలవుతున్నట్లు చెప్పారు మంత్రి. మిగిలిన రాష్ట్రాల్లోనూ అమలయ్యేలా కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతోందని అన్నారు. ఈ పథకం ద్వారా 1.5 కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నట్లు వివరించారు. జాతీయ ఆహార భద్రత చట్టం కింద మంజూరు చేసిన రేషన్ కార్డులను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేసినట్లు చెప్పారు. 91 శాతం కార్డులకు ఆధార్ అనుసంధానం కూడా పూర్తయిందని అన్నారు. రేషన్ షాపుల్లో ఇచ్చే సరకుల రేట్లు మాత్రం పెంచడంలేదని స్పష్టం చేశారు.