అధిక బరువు సమస్యా.. నిద్రకు ముందు ఇవి చేస్తే సులభంగా తగ్గొచ్చు..?

praveen
ఈ మధ్యకాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరూ కనీసం ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు అన్న విషయం తెలిసిందే. అంతే కాదు అధునాతన జీవనశైలిలో ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కూడా ఒకేచోట గంటల తరబడి కూర్చుని చేసే విధంగా ఉండటంతో అందరూ కూడా వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఎంతో మంది అధిక బరువుతో బాధపడుతు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విషయం తెలిసిందే.  అధునాతన జీవనశైలి..  చిత్రవిచిత్రమైన ఆహారపు అలవాట్ల కారణంగా అధిక బరువు పెరిగిపోతు ఇక ఆ తర్వాత అధిక బరువు తగ్గడానికి ఎన్నో పాట్లు పడుతున్నారు ప్రతి ఒక్కరు.


 ఈ మధ్యకాలంలో యువతలో ప్రతి ఒక్కరిలో  అధిక బరువు అనే సమస్య తలెత్తుతుంది అన్న విషయం తెలిసిందే. అధునాతన జీవనశైలికి అలవాటు పడిపోయి అధిక బరువు పెరగడం ఇక బరువు తగ్గించుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేయడం లాంటివి కూడా చేస్తున్నారు. ఇదే సమయంలో ఇక బరువు తగ్గిస్తాం అంటూ ఇప్పటికే ఎన్నో రకాల కంపెనీలు తమ ప్రొడక్టులను మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి. అయితే రోజువారి అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు ఎంతో సులభంగా బరువు తగ్గొచ్చు అని అటు నిపుణులు కూడా సూచిస్తున్నారు.




 ముఖ్యంగా సరైన జీర్ణక్రియ మంచి నిద్ర బరువును తగ్గిస్తాయి అంటూ చెబుతున్నారు నిపుణులు. రాత్రి భోజనంలో అధిక కాలరీలు అందించే ఆహారం కి, స్పైసీ ఫుడ్ కి దూరంగా ఉంటే మంచిది అని చెబుతున్నారు.  అంతేకాదు రాత్రి సమయంలో నిద్రకు ఉపక్రమించే ముందు.. బాదం లేదా సోయా పాలు తాగడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందట.  ఒక కప్పు చమోమిలే టీ తీసుకోవడం ద్వారా కూడా ప్రయోజనం ఉంటుందట. దాల్చిన చెక్క టీలో  తేనె కలుపుకొని తాగితే కూడా ఎంతో ప్రయోజనం ఉంటుందట. అంతే కాకుండా నానబెట్టిన మెంతులు నిద్రకు ఉపక్రమించే ముందు తింటే బరువు తగ్గడానికి ఆస్కారం వుంటుంది. అంతేకాకుండా పసుపు పాలు కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: