జగడ్డ: చిత్తూరులో ఫ్యాన్ హవా..టీడీపీ గల్లంతు..!

Satvika
ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల తంతు ముగిసింది.. నాలుగు విడతలుగా జరిగిన ఈ ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని అందుకుంది.. మూడు విడతల్లో ఫ్యాన్స్ స్పీడ్ కు మిగిలిన పార్టీలు అన్నీ కొట్టుకు పోయాయి.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజక వర్గాల్లో అధిక స్థానాల్లో వైసీపీ విజయాన్ని అందుకుంది. ఈరోజు నాలుగో విడత ఎన్నికల పోలింగ్ జరిగింది. మరో వైపు ఏకగ్రీ వాలు కూడా ఎక్కువ అయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే తపనతో టీడీపీ ప్రయత్నిస్తుంది. అలాగే వైసీపీ కూడా గెలుపు కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నాలుగో విడత ఎన్నికలు మాత్రం కాస్త ఎక్కువగానే ఆసక్తి కలిగిస్తున్నాయి. మూడు విడతల్లో అధికార పార్టీకి గట్టి పోటీని ఇచ్చిన టీడీపీ ఇప్పుడు గెలుపు కోసం ప్రయతించింది.

కాగా, 13 జిల్లా ల్లోని 16 రెవెన్యూ డివిజన్లలో గల 161 మండలాల్లో 67,75,226 మంది ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మూడు దశల పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ దశతో రాష్ట్రంలో నోటిఫికేషన్‌ ఇచ్చిన 13,097 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తవుతాయి.6,047 పోలింగ్‌ కేంద్రాలు సమస్మాత్మక, మరో 4,967 కేంద్రాలు అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించి, అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 6.30 నిమిషాలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం 3.30 వరకు జరిగింది.

అనంతరం 4 నుంచి ఎన్నికల లెక్కింపును చేపట్టారు.. ఇప్పటికీ వరకు జిల్లాల్లో ఫలితాలను చూస్తే వైసీపీ జోరు కొనసాగుతుంది...చిత్తూరు లో ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ లో టీడీపీ కి తక్కువ ఓట్లు నమోదు అయ్యాయి. అయితే మూడు విడతల్లో జరిగిన సీన్ రిపీట్ అయ్యింది. చిత్తూరు జిల్లాలోని పలు నియోజవర్గాల్లో ఫ్యాన్ స్పీడ్ కొనసాగుతుంది.. 25 వైసీపీకి,10 టీడీపీకి అనుకూలంగా వచ్చాయి. టీడీపీ పోటీకి సిద్ధమవుతుంది.ఇక జనసేన ఖాతా తెరవలేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: