జగన్ నోట.. ఆ మాట వస్తే.. నవ్వు ఆపుకోలేకపోతున్నాం.. బాబోయ్..!?
విభజన వల్ల ఆంధ్ర రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని జగన్ గుర్తు చేశారు. ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. విచిత్రం ఏంటంటే.. జగన్ సీఎం అయ్యాక తొలి మీటింగ్‌లోనే మోడీకి బంపర్ మెజారిటీ వచ్చింది కాబట్టి.. ఇక మనం ప్రత్యేక హోదా గురించి అడిగినా ఉపయోగం ఉండబోదన్నారు. మోడీకి కాస్త తక్కువ మెజారిటీ వచ్చి ఉంటే.. హోదా కోసం డిమాండ్ చేసేవాళ్లమన్నారు. ఇక ఆ తర్వాత నుంచి కూడా అదే మాట వినిపిస్తున్నారు.
మొత్తానికి అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు జగన్ ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో కోట్లాడే పరిస్థితి లేదు. అటు కేంద్రం కూడా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదనే పలుసార్లు తేల్చి చెప్పింది. అలా మొత్తానికి ప్రత్యేక హోదా అన్నది ఓ నినాదంగా మాత్రమే మిగిలింది. మరి వాస్తవం ఇలా ఉంటే.. సీఎం జగన్ మాత్రం అప్పుడప్పుడు అడగకపోతే బావుండదన్నట్టు ఈ అంశాన్ని కేంద్రంతో ప్రస్తావిస్తున్నారు.
మరి కేంద్రం ఇలాంటి విజ్ఞప్తులు పట్టించుకుంటుందా.. ఇలా అడుక్కుంటే కరుణిస్తుందా.. సీరియస్‌గా ఉద్యమం చేయకపోతే ప్రత్యేక హోదా అంటూ వస్తుందా.. అంటే సమాధానం చెప్పలేం.. అందుకే సీఎం జగన్ ప్రత్యేక హోదాతో పాటు ఇతర అంశాలూ మాట్లాడారు. తయారీ రంగం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించారు. రుణాలపై అధిక వడ్డీల భారం, విద్యుత్ ఖర్చులు అధికంగా ఉండటం భూసేకరణలో ఆలస్యం వంటి అంశాలు తయారీ రంగానికి అవరోధంగా మారాయని చెప్పారు. అందుకే జగన్ నోట మళ్లీ ప్రత్యేక హోదా అనే మాట వినిపిస్తే జనం కామెడీగానే తీసుకునే పరిస్థితి ఉంది.