భర్త తెచ్చిన చీరతోనే ఉరివేసి చంపిన భార్య.. అసలేం జరిగిందంటే..?
మరికొంతమంది ఇక భర్త వేధింపులు తాళలేక చివరికి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు కూడా కోకొల్లలు. ఇలా రోజురోజుకు భార్య భర్తల బంధం లో తలెత్తుతున్న చిన్నపాటి గొడవలు విషాదంగా ముగుస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పెళ్లయిన కొన్నాళ్లపాటు అంతా బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత మద్యానికి బానిసైన భర్త తరచుభార్యను టార్చర్ పెట్టేవాడు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల పాటు పెళ్లి బంధానికి ఎంతో గౌరవం ఇచ్చి వేధింపులు భరించిన భార్య వేధింపులు మరీ ఎక్కువవడంతో సహనం కోల్పోయింది. చివరికి చీరతో ఉరి వేసి భర్తను చంపేసింది.
ఈ ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. ఫతేపూర్ బేరి ప్రాంతంలో సికిందర్, సరితా దేవి దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే వీరికి పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. ఇక పోతే గత కొంతకాలం క్రితం తాగుడికి బానిస గా మారిపోయిన భర్త తరచు తాగి వచ్చి భార్యను చిత్రహింసలకు గురి చేసే వాడు. అంతే కాకుండా పిల్లల ముందే అసభ్య పదజాలంతో దూషిస్తూ మానసికంగా కూడా హింసించేవాడు. ఈ క్రమంలోనే ఇక రోజురోజుకు భర్త వేధింపులు ఎక్కువ అవుతుండడంతో సహించ లేక పోయినా భార్య ఓ రోజు గతంలో భర్త తెచ్చిన కొత్త చీర ని తీసుకొని భర్తకు ఉరివేసి హత్య చేసింది. అంతేకాదు పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించి భార్య సరితాదేవి.