బంపర్ ఆఫర్.. నెలకు రూ.లు 4వేలు కడితే చాలు.. రాయల్ ఎన్ ఫీల్డ్ మీ సొంతం..?
ఈ క్రమంలోనే ఇటీవలె మోస్ట్ పవర్ఫుల్ బైక్ తయారీ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ అదిరిపోయే ఆఫర్ కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచింది. ఇక ఇటీవల రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకటించిన ఆఫర్ తో కస్టమర్లు ఎంతో తక్కువ ఈఎంఐ తోనే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. మోస్ట్ పాపులర్ బైక్ క్లాసిక్ 350 ని ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఒకవేళ మీరు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుగోలు చేయాలి అని భావిస్తే ఇందుకోసం ముందుగా 20 వేల రూపాయల డౌన్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది.. ఇక ఆ తర్వాత మిగతా మొత్తాన్ని బ్యాంకు లోన్ రూపంలో అందిస్తుంది ప్రతినెల ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
హెచ్‌డిఎఫ్‌సి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, టాటా క్యాపిటల్ వంటి పలు సంస్థలతో రాయల్ ఎన్ఫీల్డ్ భాగస్వామ్యం కుదుర్చుకుని తమ కస్టమర్లకు ఈ సదుపాయాన్ని అందిస్తుంది. ఒకవేళ మీరు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ కొనుగోలు చేయాలని భావిస్తే.. 3,4, 5 ఏళ్ల కాల పరిమితిలో ఈఎంఐ ఎంత చెల్లించాల్సి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ మీరు 3 ఏళ్లకు ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ.6,057 చెల్లించాలి. అదే మీరు 4 ఏళ్లకు ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ.4941 కట్టాలి. అదే ఐదేళ్లకు ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే రూ.4,287 చెల్లించాలి. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. సింగిల్ ఛానెల్ ఏబీఎస్ వెర్షన్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.67 లక్షలుగా ఉంది. అదే డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.71 లక్షలు. ఇకపోతే ఆన్‌రోడ్ ధర రూ.2 లక్షలు దాటిపోవచ్చు.