పుర పోరు : కార్పొరేషన్ ఎన్నికల పై బాబోరి అంచనా ఇది.. బోల్తా అయితే కొట్టదుగా..?
అయితే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీకి షాక్ ఇవ్వాలని టిడిపి ప్రయత్నాలు చేసినప్పటికీ ఇక పూర్తి స్థాయిలో మాత్రం వైసీపీ పార్టీకి టీడీపీ పోటీ ఇవ్వలేక పోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఈక్రమంలోనే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దే హవా కొనసాగింది ఇకపోతే కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటుతాం అనే ధీమాతో ఉంది టిడిపి పార్టీ. ఈ క్రమంలోనే ఎన్ని కార్పొరేషన్ లలో పార్టీ విజయం సాధిస్తుంది అనేదానిపై కొన్ని రకాల అంచనాలను వేసుకుంటుంది టిడిపి పార్టీ.
కొన్ని కార్పొరేషన్ లతో టీడీపీదే విజయం అంటూ ఇటీవల అంచనాకు వచ్చింది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 కార్పొరేటర్లు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఈ పన్నెండు కార్పొరేషన్లు అన్నింటిలో తెలుగుదేశం అంచనా ప్రకారం ఐదు కార్పొరేషన్ లలో విజయం సాధిస్తామని ధీమాతో ఉంది. విజయనగరం కార్పొరేషన్ తో పాటు ఏలూరు కార్పొరేషన్ లో కూడా టిడిపి విజయం సాధిస్తుందని ప్రస్తుతం అంచనా వేస్తోంది. మచిలీపట్నంలో కాపు సామాజిక వర్గం బలంగా ఉండడంతో జనసేన సపోర్ట్ చేస్తేఅక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది. అంతేకాకుండా గుంటూరు విజయవాడ కార్పొరేషన్ లలో కూడా విజయం సాధిస్తామని ఆశలు పెట్టుకుంది చూపియండి. అయితే 5 కార్పొరేషన్లలో విజయం సాధించడమే కాదు మిగతా కార్పొరేషన్లో గట్టి పోటీ ఇస్తాను అనే నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది.