డ్రంక్ అండ్ డ్రైవ్.. ఏకంగా పోలీసులకే టక్కర్ ఇచ్చాడు..?

praveen
ఈ మధ్య కాలంలో వాహనాలను నిబంధనలు పాటించి  నడిపే వారి కంటే నిబంధనలను  అతిక్రమించి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ అవుతుంది అన్న విషయం తెలిసిందే.  ముఖ్యంగా ఎంతోమంది మందుబాబులు నేటి రోజుల్లో రెచ్చిపోయి మరీ వాహనాలు నడుపుతున్నారు. అప్పటికే మద్యం మత్తులో ఫుల్ కిక్ లో ఉన్న మందుబాబులు ఇక రోడ్డుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వాహనంతో రావడంతో ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా తెర  మీదకి వస్తున్నాయి అన్న  విషయం తెలిసిందే.  అయితే పోలీసులకు దొరికితే భారీగా జరిమానాలు విధించినప్పటికీ మందు బాబుల తీరులో  మాత్రం మార్పు రావడంలేదు.


 ఇకపోతే ఈ మధ్య కాలంలో అటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ మందుబాబులకు భారీ జరిమానాలు విధిస్తున్నారు. అంతేకాకుండా మరోసారి మద్యం తాగి వాహనం నడపకుండ కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపడం లేదు కానీ ఇప్పటికీ కూడా కొంతమంది నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడమే  కాదు ఏకంగా తనిఖీలు చేస్తున్న పోలీసులపై కూడా వాహనం తో దూసుకుపోతున్న ఘటనలు ఎన్నో తన మీదకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.



 ఇటీవలే ఓ మందు బాబు చేసిన పనికి ఏకంగా ట్రాఫిక్ ఎస్ఐ గాయాలపాలయ్యాడు. కేపీహెచ్బీ లో అర్ధరాత్రి సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే సాయి కుమార్ అనే వ్యక్తి బుల్లెట్ బైక్ పై అటువైపుగా వచ్చాడు.  అయితే ముందు భారీ గేట్లు పోలీసులు ఉన్నారు అని గ్రహించి ఎక్కడ బైక్ ఆపకుండా ఎంతో వేగంగా దూసుకొచ్చాడు. ఈ క్రమంలోనే బారికేడ్లు చెల్లాచెదురు అయిపోవడంతో పాటు..  ఎస్సై కి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే అతన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే గాయాలు అయిన ఎస్ఐని ఆస్పత్రికి తరలిస్తుండగా సాయి కుమార్ అనే వ్యక్తి తప్పించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: