గోరింటాకుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. ఇవి మీకు తెలుసా..?

praveen
ప్రస్తుతం భారతీయ సాంప్రదాయం ప్రకారం గోరింటాకుకు  ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మహిళలు గోరింటాకును ఎంతో ఇష్ట పడుతూ ఉంటారు.  అయితే ప్రస్తుతం టెక్నోలజీ పెరిగిపోయి మార్కెట్లోకి ఎన్నో రకాల గోరింటాకు లు వచ్చినప్పటికీ ఇక సహజసిద్ధమైన గోరింటాకు అంటేనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు జనాలు.  ఇక గోరింటాకు చేతికిపెట్టుకుని మహిళలు మురిసిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  అంతేకాదు కొంతమంది గోరింటాకు తలకు కూడా రాసుకుంటారు అలా చేయడం వల్ల తల వెంట్రుకలు ఎంతో బలంగా మారతాయని నమ్ముతూ ఉంటారు.



 సాధారణంగా మనదేశంలో గోరింటాకును తరచూ అందరూ వినియోగిస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. కొన్ని రోజులకు ఒకసారి గోరింటాకు పెట్టుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అయితే ఇప్పటి వరకు గోరింటాకు అంటే కేవలం చేతులకు పట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని అందరికీ తెలుసు.. కానీ గోరింటాకు ద్వారా కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్నది మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గోరింటాకు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది అని నిపుణులు చెబుతున్నారు.



 గోరింటాకు అరికాళ్ళ నొప్పిని కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెబుతున్నారు నిపుణులు. అంతేకాకుండా గోరింటాకు నూరి తలకు పెట్టుకుంటే..వెంట్రుకలు దృఢంగా మారడంతో పాటు ఇక తలలోని వేడిని కూడా తగ్గిస్తుందట. అంతేకాకుండా గోరింటాకు గోళ్ళు పుచ్చినచోట పెట్టుకుంటే ఎంతో మంచిది అని సూచిస్తున్నారు నిపుణులు. ఇక గోరింటాకు ఆకు నమిలితే చిగుళ్లవ్యాధి నోటిపూత లాంటి సమస్యలు కూడా దూరం అవుతాయట. ఇక గోరింటాకు బెరడును నానబెట్టి ద్రవాన్ని తాగితే కాలేయం గుండెకు ఎంతో ఆరోగ్యాన్ని సమకూరుస్తుంది అని చెబుతున్నారు నిపుణులు. ఇలా మనం తరచూ వాడే గోరింటాకు లో కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటూ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: