గోరింటాకుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..!?

N.ANJI
మనకు తెలిసినంత వరకు గోరింటాకుని చేతులకు పెట్టుకుంటారని అందరికి తెలిసిందే. కానీ గోరింటాకుతో ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. అయితే ఈ గోరింటాను చేతులకు మాత్రమే కాకుండా.. తలకు కూడా పట్టిస్తుంటారు. ఇలా చేయడం వలన తలలో వేడిని తగ్గిస్తుందని అంటుంటారు. ఇదే కాకుండా దెబ్బతగిలిన చోట ఈ గోరింటాకును అద్దడంవలన తొందరగా తగ్గిస్తుంది. ఇవే కాకుండా దీంతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే అరికాళ్ళ మంటగా ఉన్నప్పుడు గోరింటాకును రాయడం వలన ఉపశమనం లభిస్తుంది. కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు నొప్పి కలిగే చోట గోరింటాకును రాయడం వలన ఉపశమనం లభిస్తుంది. ఇవే కాకుండా గోరు పుచ్చిపోయిన ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి గోరింటాకు ముద్దను పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ గోరింటాకు బెరడు, విత్తనాలు జ్వరాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే దీని విత్తనాలు విరేచనాలను తగ్గించే శక్తి కూడా ఉంది.
ఇక శరీరంలో అధిక వేడి ఉన్నవారు ఈ గోరింటాకు ముద్ధలను తినడం వలన సమస్య తగ్గుతుంది. తలనొప్పి ఎక్కువగా బాధించేవారు ఈ గోరింటాకును మాడుకు పట్టించడం వలన ఉపశమనం లభిస్తుంది. అలాగే తెల్లబడిన వెంట్రుకలకు వారానికోసారి ఈ గోరింటాకు పెటడం వలన క్రమంగా శ్వాశత నలుపుకు చేరుకుంటాయి. గోరింటాకును చేతులుకు పెట్టుకున్నప్పుడు నరాలపై కలిగించే శీతలీకరణ ప్రభావం ద్వారా శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. తద్వారా ఆర్థరైటిస్ లక్షణాల వల్ల వచ్చే మంటను తగ్గిస్తుంది. గోరింటాకు నమలడం వల్ల చిగుళ్ల వ్యాధిని తగ్గిస్తుంది అలాగే నోటి పూతకు చికిత్స చేస్తుంది.
అంతేకాక గోరింటాకు బెరడు లేదా ఆకులను నీటిలో నానబెట్టి, ఆపై ద్రవాన్ని తీసుకోవడం ద్వారా మెరుగైన ప్లీహము, కాలేయాన్ని ఆరోగ్యానికి ఉంచేందుకు సహయపడుతుంది. గోరింటాకు గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. మీరు గోరింట నీరు లేదా విత్తనాలను తీసుకోవడం వలన గుండె వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించి.. రక్తపోటును నియంత్రించి హైపోటెన్సివ్ ప్రభావాన్ని అందిస్తుంది. ఇది గుండె, ధమనులలో ఫలకం, ప్లేట్‌లెట్ ఏర్పడకుండా నిరోధించడానికి, గుండెపోటు, స్ట్రోక్‌లను నివారించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: