వైరల్ వీడియో : స్కూటీ నేర్చుకుంటూ పడబోయిన మమత బెనర్జీ..?

praveen
" data-original-embed="" >
ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారి పోతున్నాయి. అయితే రోజురోజుకు పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోవడం పై అటు ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వివిధ రకాలుగా నిరసనలు కూడా తెలుపుతున్నారు. కాగా ఇటీవలే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "> మమతా బెనర్జీ సైతం కేంద్రం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 పెట్రోల్ ధరలు భారీగా పెరిగి పోవడంతో వాటికి నిరసనగా పెట్రోల్ డీజిల్ కార్లలో ప్రయాణించలేనంట్టు ఎలక్ట్రిక్ స్కూటీ పై సచివాలయానికి వెళ్లారు మమతాబెనర్జీ. కోల్కతా మేయర్ స్కూటీ నడిపితే ఆమె వెనకాల కూర్చొని కోల్కత్తా రోడ్లపై ప్రయాణించారు. అయితే సాయంత్రం సచివాలయం నుంచి వచ్చేటప్పుడు మమతాబెనర్జీ స్కూటీ నడిపే ప్రయత్నం చేశారు కానీ ఆమెకు స్కూటీ పర్ఫెక్ట్ గా  రాకపోవడంతో.. స్కూటీ నడుపుతూ ఒక్కసారిగా కిందపడిపోయారు సీఎం మమతా బెనర్జీ. దీంతో సహాయ సిబ్బంది అప్రమత్తమై ఆమెను పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఇక సహాయ సిబ్బంది స్కూటీ ని పట్టుకుని ఆమెకు నేర్పించే ప్రయత్నం చేశారు. ఇలా కొంత దూరం పాటు బండిని నడిపారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.


 కాగా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే బిజెపి టిఎంసి పార్టీలు మరి ప్రచారాన్ని మొదలు పెట్టాయి అన్న విషయం తెలిసిందే. ఇక ప్రచార సభల్లో ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటూ దుమ్మెత్తి పోస్తున్నాయి.  మరోవైపు అటు వివిధ పార్టీలకు చెందిన నేతలు కూడా ఇతర పార్టీలలోకి జంపింగ్ అవ్వడం అలాంటి సీన్లు కూడా ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "> మమతా బెనర్జీ ప్రభుత్వం పెట్రోల్ ధరల పెంపును టార్గెట్గా చేసుకుని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: