చంద్రబాబు కి భారీ షాక్ ఇచ్చిన మోడీ..
కుప్పం లో పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆయన మాత్రం జమిలి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాం అని టీడీపీ నేతలు అందరికీ ఉపదేశిస్తున్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతారా అడిగితే లేదనే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం మన ప్రధాని నరేంద్ర మోడీ పై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. నూతన వ్యవసాయ బిల్లుల కారణంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రైతులు మోడీపై విపరీతంగా కక్ష పెంచుకున్నారు. ఈసారి మోడీని ఎలాగైనా అధికారం నుంచి దించేయాలని అక్కడి రైతులందరూ బలంగా నిశ్చయించుకున్నారు.
ఇదొక్కటే కాదు పెరుగుతున్న పెట్రోల్, గ్యాస్ ధరలు కూడా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం పై తీవ్ర వ్యతిరేకత తెస్తున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలు మోడీ పరిపాలన పై నిప్పులు చెరుగుతున్నారు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ ధరలు సెంచరీ దాటి పరిగెడుతున్నాయి. కరోనా సమయంలో కూడా ప్రజలకు అండగా ఉండే విషయంలో మోడీ పూర్తిగా విఫలమయ్యారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం మోడీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.
ఇటువంటి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళితే మోడీకి చేదు ఫలితాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఆయన జమిలి ఎన్నికలు అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. దీంతో చంద్రబాబు కి భారీ షాక్ తగిలినట్లయింది. ఎందుకంటే 2024 నాటికి తన ఆరోగ్యం ఎలా ఉంటుందో అని చంద్రబాబు ఆందోళన పడుతున్నారు. త్వరగా ఎన్నికలు వస్తే అధికారంలోకి రావచ్చని.. టీడీపీ సామ్రాజ్యాన్ని కాపాడుకోవచ్చని ఆశపడుతున్నారు. కానీ ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో చంద్రబాబు ఆశలు నీరుగారుతున్నాయి.