జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఇలా చేస్తే 24 నెలలు ఉచిత అన్ లిమిటెడ్ సర్వీస్..?
అయితే గతంలో రిలయన్స్ జియో టెలిగ్రామ్ రంగంలోకి అడుగు పెట్టిన సమయంలో అటు తమ సబ్స్క్రైబర్ల సంఖ్యను పెంచుకోవడానికి ఉచిత ఆఫర్లను ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికి ఇలాంటి తరహా ఆఫర్లను కొనసాగిస్తూ తమ కస్టమర్లను ఆకర్షిస్తూనే ఉంది ఇటీవలే మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మరోసారి జియో తమ కస్టమర్ల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా ఇరవై నాలుగు నెలల పాటు అన్లిమిటెడ్ సర్వీసులు పొందేందుకు అవకాశం కల్పిస్తూ జియో ఇటీవలే కస్టమర్ల కోసం బంపర్ ఆఫర్ సిద్ధం చేసింది.
ఒకవేళ జియో కస్టమర్లు 1999 రూపాయల విలువ చేసే జియో ఫీచర్ ఫోన్ కొనుగోలు చేస్తే.. ఇక ఇరవై నాలుగు నెలల పాటు అన్లిమిటెడ్ కాల్స్ వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. అదే 1499 రూపాయల విలువైన ఫీచర్ ఫోన్ కొనుగోలు చేస్తే 12 నెలల పాటు అన్లిమిటెడ్ కాల్స్ వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ రెండు ఫోన్ లలో ఏ ఫోన్ కొనుగోలు చేసిన కూడా ఇక ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు నెలకు రెండు జీబి డేటా ఉచితంగా వస్తుంది. అయితే ఇప్పటికే జియో ఫీచర్ ఫోన్స్ వాడుతున్నవారు 749 రూపాయలతో రీఛార్జ్ చేసి ఈ ఆఫర్ పొందుతున్నారు అన్న విషయం తెలిసిందే.