బెంగాల్‌లోనే 8 విడతల ఎన్నికలు.. మోడీ, అమిత్‌షా ప్లాన్ అదేనా..?

Chakravarthi Kalyan
ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. అస్సోం, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా ప్రకటించారు. కేరళ 140, అస్సోం 126, తమిళనాడు 234, పశ్చిమబెంగాల్‌ 294, పుదుచ్చేరి 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు 16 రాష్ట్రాల్లో 34 స్థానాలకు ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్‌ విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్‌ అసెంబ్లీకి కూడా షెడ్యూల్‌ విడుదల చేశారు. ఎన్నికల ఫలితాలు మే 2వ తేదీన ప్రకటించనున్నారు.

అయితే.. ఈ ఎన్నికల షెడ్యూల్‌లో ఓ విశేషం ఉంది. మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంటే.. ఒక్క బెంగాల్, అసోంలోనే ఒకటి కంటే ఎక్కువ విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిల్లో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. బెంగాల్‌లో 8 విడతలుగా.. అసోంలో రెండు విడతలుగా ఎన్నికల షెడ్యూల్‌ ఉంది. ఒక్క బెంగాల్‌లోనే 8 విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించడం వివాదస్పదం అవుతోంది. దీనిపై ఇప్పటి కే  పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "> మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోడీ, అమిత్‌ షా చెప్పినట్టే ఈసీ నడుచుకుంటోందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్‌లో పాగా వేసేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడలో భాగంగానే 8 విడతల్లో ఎన్నికల నిర్వహిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ వర్గాల నుంచి నాకు సమాచారం అందింది. వారి సలహాలకు అనుగుణంగానే ఈ తేదీలు ఖరారు చేసినట్లు కనిపిస్తోంది. ఒకరోజు ఓ జిల్లాలోని సగం నియోజకవర్గాలకే ఎన్నికలు నిర్వహిస్తారా? ఇది ప్రధాని మోదీ ఐడియానా లేదంటే అమిత్‌ షా చెప్పారా? 294 శాసన సభ స్థానాలున్న బెంగాలో పాటు షెడ్యూల్‌ ప్రకటించిన తమిళనాడు, కేరళలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తూ తమ రాష్ట్రంలో మాత్రం ఎందుకిలా అనిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "> మమతా బెనర్జీ ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: