బ్యాంకుకు కన్నం వేయడం అంటే ఇదేనేమో.. ఏకంగా సొరంగం తవ్వి మరి..?

praveen
ఈ మధ్య కాలంలో దొంగల బెడద రోజు రోజుకు ఎక్కువవుతు  ఉంది అన్న విషయం తెలిసిందే.  పోలీసులు ఎక్కడికక్కడ దొంగల పై ఉక్కు పాదం మోపుతున్నప్పటికీ దొంగలు మాత్రం రెచ్చి పోతూనే ఉన్నారు. అయితే పాత పద్ధతిలో కాకుండా కొత్త పద్ధతులలో దొంగతనాలను  చేస్తూ పోలీసులకు కనీసం ఆధారాలు  కూడా చిక్కకుండా ఎంతో చాకచక్యం గా అందినకాడికి దోచుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఈ మధ్య కాలం లో దొంగలను  పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 అయితే కొంత మంది దొంగలు అయితే ఎంతో వినూత్నం గా ఆలోచిస్తున్నారు.. సినిమాల ప్రభావమా.. లేక సోషల్ మీడియా ఇన్స్పిరేషనా తెలియదు కానీ రోజురోజుకు దొంగలు అవలంభిస్తున్న కొత్త విధానాలు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.  ఎవరూ ఊహించని రీతిలో దొంగతనాలకు పాల్పడుతున్నారు.  ఇక్కడ ఓ దొంగ ఇలాంటి దొంగతనానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. కానీ... అతని ప్రయత్నం కాస్త విఫలం అయింది.

 ఇళ్లలో దొంగతనం చేస్తే ఏం వస్తుంది ఏకంగా బ్యాంకు కి అన్నం వేస్తే లైఫ్ లో సెటిల్ అవ్వచ్చు అనుకున్నాడో  ఏమో దీనికోసం పక్కా ప్లాన్ వేసాడు. దీనికోసం డోర్లు పగలగొట్టడం కిటికీలు తెరవటం  లాంటివి  చేయలేదు ఏకంగా బిల్డింగ్ లోపలికి వెళ్లేందుకు ఒక సొరంగాన్ని తొవ్వాడు. 5 మీటర్ల వెడల్పు నాలుగు మీటర్ల లోతు ఉన్న ఒక గోతిని తవ్వాడు. ఢిల్లీలోని ఓ ప్రాంతంలో ఉన్న కెనరా బ్యాంక్ బ్రాంచ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.  ఏకంగా గోతిలోనుండి  బ్యాంకు లోకి ప్రవేశించిన ఆ దొంగ లాకర్స్  ఓపెన్ చేయడం లో విఫలం అయ్యాడు. దీంతో మళ్లీ వెనుదిరిగాడు తర్వాత పోలీసులు సిసిటివి ఫుటేజీ ఆధారంగా అతన్ని గుర్తించి అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: