కేసీఆర్ గుట్టు రట్టు చేస్తా.. ఇది అణు బాంబే అంటున్న బండి సంజయ్..ఏంటా నిజం..?
అలాంటి బండి సంజయ్ ఇప్పుడు కేసీఆర్ పై మరో బాంబు పేలుస్తానంటూ ఫీలర్ వదిలారు. ఈ బాంబు అలాంటి ఇలాంటిది కాదంట.. కేసీఆర్ కేంద్రమంత్రిగా, ఎంపీ ఉన్న సమయంలో చేసిన అవకతవకలు బండి సంజయ్ బయటపెట్టబోతున్నాడంట. బండి సంజయ్ విలేకరులతో చిట్ చాట్ సందర్భంగా ఈ విషయం చెప్పారు. కేసీఆర్ ఎంపీ గా, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించారట.. ఘోరమైన తప్పిదం చేశారట... ఆ వివరాలు త్వరలోనే బయట పెడుతడట బండి సంజయ్.
కేసీఆర్ ఎలాంటి తప్పు చేసారో తెలంగాణ సమాజానికి చెప్పుతానంటున్నారు బండి సంజయ్. కేసీఆర్ పార్లమెంట్ ను తప్పు దోవ పట్టించిన ఘటన బయట పెట్టడానికి బండి సంజయ్ ఇప్పటికే పార్లమెంట్ స్పీకర్ అనుమతి కోరారట. అలాగే పార్టీ హైకమాండ్ అనుమతి కూడా కోరారట. ఇక ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ బండారం బయటపెడతారట. అది బయటపెటితే.. తెలంగాణలో రాజకీయ భూకంపం ఖాయం అంటున్నారు బండి సంజయ్. మరి ఆ స్థాయలో భూకంపం వచ్చే బండారం ఏంటో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. మొత్తానికి మరోసారి తన మాటలతో మంటలు రేపారు బండి సంజయ్. మరి టీజర్ బాగానే ఉంది.. అసలు సినిమాలో దమ్ము ఎంతవరకూ ఉంటుందో చూడాలి.