చిరంజీవి మీద ఆధారపడుతున్న మోడీ...?

కేంద్ర ప్రభుత్వం దక్షినాది మీద ఎక్కువగా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాల్లో కొన్ని కార్యక్రమాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా అమలు చేస్తూ వస్తోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలపరిచే విధంగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. కర్ణాటకలో ఎలాగు బలంగానే ఉంది. తమిళనాడు కేరళ రాష్ట్రాల మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయించే ఆలోచనలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఈ నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కొంతమంది సినీస్టార్ల ద్వారా ప్రచారం చేయడానికి రెడీ అయ్యారని అంటున్నారు. కేరళ రాష్ట్రానికి మోహన్ లాల్ ద్వారా తమిళనాడు రాష్ట్రానికి రజినీకాంత్ ద్వారా అలాగే ఆంధ్ర ప్రదేశ్ కి చిరంజీవి ద్వారా తెలంగాణకు అక్కినేని నాగార్జున ద్వారా ప్రచారం చేయించే ఆలోచనలో ఉన్నారు అని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం ఉంది. దీనికి సంబంధించి ఇంకా ఇటువంటి స్పష్టత లేకపోయినా ప్రధానమంత్రి త్వరలోనే కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
ప్రజల్లోకి బలంగా వెళ్లకపోవడం అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాల విషయంలో చాలా వరకు కూడా దూరం పాటిస్తూ ఉండటంతో ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రజల్లోకి వెళ్లడానికి సినీ నటులను నమ్ముకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటికే వీళ్ళు అందరు కూడా కేంద్ర ప్రభుత్వానికి దగ్గరగానే వ్యవహరిస్తున్నారని చెప్పాలి. మరి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి సినీ నటులు ఎంత బలంగా తీసుకెళ్తారు ఏంటి అనేది చూడాలి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులు కూడా సినీ నటులతో త్వరలోనే సమావేశాలు కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయని... కొంతమంది ప్రధాని కార్యాలయ అధికారులు కూడా సినీనటి లతో సమావేశం అయ్యే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: