కేంద్రంపై యోగి తిరుగుబాటు...?

రాజకీయంగా ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో కొన్ని అంశాలను చాలా సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం పెద్దగా ఏమీ పట్టించు కునే ప్రయత్నం చేయటం లేదు. దీని వలన ప్రజలలో కూడా భారతీయ జనతా పార్టీ నేతలు చులకన అవుతున్నారు. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధిష్టానం దెబ్బకు ముఖ్యమంత్రులు కూడా ఇబ్బందులు పడుతున్నారనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ అధిష్టానంతో సన్నిహితంగా మెలిగిన చాలా మంది ముఖ్యమంత్రులు ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతుంది.
క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ఎంత మాత్రం అర్థం చేసుకోకుండా తాము తీసుకున్న నిర్ణయం ఎలా అయినా సరే ప్రజల మీద రుద్దాలి అనే భావనతో భారతీయ జనతా పార్టీ పెద్దలు వెళ్తున్నారు. ప్రజల ఆకాంక్షలు ఏంటి అనేది గత ఏడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం తెలుసుకున్న పరిస్థితి లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రైవేటీకరణ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు. పైగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తున్నారు. అలాగే ఇంధన ధరల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి.
పెట్రోల్ ధరలు పెరిగిపోయి సామాన్యులు నానా అవస్థలు పడుతున్నారు. చిన్నచిన్న ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్పాలి. కంపెనీలు కూడా ఇప్పుడు ఇంధన ధరల విషయంలో ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు అయితే జీతాలు కూడా సరి పోయే పరిస్థితి కనబడటం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సిద్ధమయ్యారని సమాచారం. త్వరలోనే ఆయన బీజేపీ పెద్దలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: