ప్రపంచంలోనే అతి చిన్నది.. ఎలుకలా కనిపించే బుజ్జి జింక..!?
అయితే జావా మూషిక జింకలు.. చూడడానికి ఎలుకలా కనిపిస్తాయి. వీటిని ట్రాగులస్ జావనికస్ అని కూడా పిలుస్తారు. ఇలాంలి బుల్లి జింకలు ఈశాన్య ఆసియాలో ఎక్కువగా కనిపిస్తాయి. జావా మూషిక జింకలు ఎక్కువగా రాళ్ల చుట్టూ కనిపిస్తాయి. దట్టమైన అడవుల్లో చెట్ల తొర్రలో నివసిస్తుంటాయి. ముఖ్యంగా నీటి లభ్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జావా మూషిక జింకలు సంచరిస్తుంటాయి. వాటిని చూస్తే జింకలు అనుకోరు. ఎలుకలే అనుకుంటారు. అంత చిన్నగా ఉంటాయి. ఇది గరిష్టంగా 18 ఇంచులు పెరుగుతాయి. కుందేలు సైజు వరకు పెరుగుతాయి.
ఇక ఓ వ్యక్తి అతి చిన్న మూషిక జింకను వీడియో తీసి టిక్ టాక్‌లో పోస్ట్ చేయడంతో.. దాని వీడియో వైరల్‌గా మారింది. ఏంటి ఇది జింకా? అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం యూరప్‌లో 43 జావా మూషిక జింకలు ఉన్నాయి. ఐతే ప్రస్తుతం ఈ జాతి అంతరించి పోయే దశలో ఉంది. ఎందుకంటే అడవులను నరకడం, అక్రమ వేటతో ఈ జింకలు ఎక్కువగా కనిపించడం లేదు. సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. కొన్ని చోట్ల అడవుల్లో మూషిక జింకలను వేటగాళ్లు వేటాడుతున్నారు. కొందరు ఇంట్లో పెంపుడు జంతువుల్లా పెంచుకుంటారు. ఇవి ఎక్కువగా శాఖాహారాన్నే తింటాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న కీటకాలను కూడా లాగిస్తాయి.