కేసీఆర్ లో అభద్రతా భావం పెరిగిందా...? అసలు ఆయన ఏం అనుకుంటున్నారు...?

తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏమో గాని ఇప్పుడు రాజకీయ పార్టీలు చాలా సీరియస్ గా కష్టపడుతున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణాలో బిజెపి సైలెంట్ గా ఉంటూ వచ్చింది. దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత బిజెపి స్పీడ్ కు ఇప్పుడు అధికార పార్టీ కాస్త ఇబ్బంది పడుతుంది అనే మాట వాస్తవం. రాజకీయంగా ఈ పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. నేను ఏ కార్యక్రమం చేయాలన్నా పాలమూరు నుంచి చేపడతా అని అన్నారు.
ఎన్నికల ప్రచారం కూడా ఇక్కడినుంచె చేపట్టాలని వచ్చా అని ఆయన వెల్లడించారు. పట్టభద్రుల ఎన్నికలను భ్రష్టు పట్టించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం యత్నిస్తున్నది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఎం కేసీఆర్ అధికార దుర్వినియోగం చేస్తున్నాడు..ఇది మంచిది కాదు అని ఆయన అన్నారు. ఎమెల్సీ అంటే పెద్దల సభ..కానీ.. టీఆర్ఎస్ వచ్చాక..చట్టసభలు నిర్వీర్యం అయ్యాయి అని ఆరోపించారు. మేము.. మా కుటుంబం అన్న ధోరణి సీఎం కేసీఆర్ ది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
తెలంగణా ప్రజలు కుటుంబ పాలన నుండి మార్పు  కోరుకుంటున్నారు అని తెలిపారు. హైదరాబాద్ లో గత గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీ కి కేవలం ఎనిమిది వేల ఓట్లు మాత్రమే తేడా అని... కానీ ఇపుడు జరిగే ఎన్నికలు మేధావుల ఎన్నికలు..ఇలాంటి ఎన్నికల్లో ఎప్పుడూ బీజేపీ మేధావుల ఆశీస్సులతో గెలుస్తూ వస్తుంది అని వివరించారు. సీఎం కేసీఆర్ లో అభద్రతా భావం వచ్చింది అని ఆయన వ్యాఖ్యానించారు. మేము గెలవకున్నా పరవా లేదు.. బీజేపీ గెలవద్దని అనుకుంటున్నారు అని విమర్శించారు. తెలంగణా ప్రజల ఆకాంక్షల పట్ల బీజేపీ కి  సద్భావాన ఉంది.. గౌరవిస్తుంది అని స్పష్టం చేసారు. ఈ రెండు నియోజక వర్గాల్లో బీజేపీ ని ఆదరించాలి.. గెలిపించాలి అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: