ఆ సంఘటన అమరావతి రైతుల పాలిట శాపం కానుందా...?

VAMSI
ఏ ముహూర్తంలో అమరావతిని రాజధానిగా ప్రకటించారో కానీ ఇది కొనసాగేలా లేదు. టీడీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం అంతా బాగానే ఉన్నా, వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుండి అమరావతికి కష్టాలు ప్రారంభమయ్యాయి. జగన్ ప్రభుత్వం అమరావతిని తాత్కాలిక రాజధానిగా చేసి మూడు రాజధానుల నిర్ణయానికి అసెంబ్లీలో బిల్లు పెట్టారు. ఎలాగూ అసెంబ్లీలో వైసీపీకి బలం ఉంది కాబట్టి బిల్లు పాస్ అయింది. కానీ పెద్దల సభలో టీడీపీకి బలం ఉన్నందున ఈ బిల్లును అక్కడ వ్యతిరేకించారు. అయినా ఈ విషయంపై పట్టు వదలని విక్రమార్కుడిలా కోర్టుకు వెళ్లింది జగన్ ప్రభుత్వం.

ఇది ఇలా ఉండగా అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని అక్కడ స్థానిక రైతులు గత సంవత్సరం నుండి దీక్షలు చేపట్టారు. ఒకవైపు ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించడం కుదరదు. ఇక్కడ భూములు చాలా సున్నితమైనవి, కాబట్టి పెద్ద పెద్ద భవనాలు నిర్మించడానికి వీలు కాదు అని చెబుతున్నారు. దీనికి సాక్ష్యమే గతంలో శివరామకృష్ణన్ కమిటీ  మరియు మరి కొన్ని కమిటీలు సర్వేలు చేసి, అమరావతిని రాజధానిగా చేయడానికి కాదు అని చెప్పారు. కానీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటన్నింటినీ తుంగలో తొక్కేసి అమరావతిని రాజధానిగా చేశారు.

దీనికి రుజువుగా నిన్న రాజధాని అమరావతి పరిసర ప్రాంతాలలో భూమి కంపించిన విషయం తెలిసిందే. దీనితో వైసీపీ కార్యకర్తలు మేము ఆనాడు చెప్పినా వినలేదు. ఈ భూములు భారీ భవనాలను నిర్మించడానికి పనికి రావు అని మరో మారు తమ స్వరాన్ని వినిపించారు. ఇక్కడ అటు అధికార పార్టీకి కానీ ఇటు ప్రతిపక్ష పార్టీకి కానీ నష్టం ఏమీ ఉండదు. అక్కడ నష్టపోయేది స్థానిక ప్రజలు. ఎన్నో ఆశలతో తమ భూములను రాజధాని నిర్మాణానికి అమ్ముకున్న ప్రజలకు తీర్వ నష్టం వాటిల్లనుంది. దీనికి ప్రభుత్వం తమ హామీలతో వారిని సంతృప్తి పరుస్తుందా లేక ఉద్యమ మరింత ఉద్రిక్తం కానుందా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: