వామ్మో.. ఏసీ వల్ల ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా..?

praveen
ఒకప్పుడు ఎక్కడ చూసినా కూడా చల్లగాలి  తగలడానికి గదిలో ఫ్యాన్ బిగించుకునే వారు. కాని ప్రస్తుతం మాత్రం టెక్నోలజీ పెరిగిపోయిందిగా..  ఫ్యాన్ వాడితే ఇంకా వెనుకబడి పోవడమే.. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏసీ లకు అలవాటు పడిపోతున్నారు అన్న విషయం తెలిసిందే.  ఇక ఏ కార్యాలయంలో చూసిన  ఒకప్పటిలా ఫ్యాన్ కనిపించడం లేదు ఎక్కడ చూసినా ఏసీ కనిపిస్తుంది.  ఇక ఏసీ ద్వారా చల్ల గాలికి బాగా అలవాటు పడిపోతున్నారు నేటి రోజులలో జనాలు.  ఇలా ఏసి వాడకం రోజురోజుకి పెరిగిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ఏసి ఆరోగ్యానికి చేటు చేస్తుంది అన్నది మాత్రం అందరిని ఆందోళన కలిగిస్తోంది


 సాధారణంగానే ఏ కాలంలో అయినా సరే ఏసి వాడకం అంతకంతకూ పెరిగి పోతుంది అన్న విషయం తెలిసిందే. అదే ఎండాకాలం వచ్చిందంటే చాలు ఇక మరింత ఎక్కువ అవుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుతం ఎండాకాలం  వస్తున్న నేపథ్యంలో మొన్నటివరకు ఏసీ లను వాడని వారు కూడా ప్రస్తుతం మళ్లీ ఏసీ లను సిద్ధం చేసుకుంటున్నారు.  అయితే కరోనా  వైరస్ వ్యాధి నేపథ్యంలో ఏసీలు వాడకం వల్ల కరోనా  వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని గతంలో పరిశోధకులు కూడా చెప్పారు అన్న విషయం తెలిసిందే. కరోనా  వైరస్ విషయం పక్కనపెడితే సాధారణంగానే ఎక్కువసేపు ఏసీలో ఉంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఎన్నో అధ్యయనాల్లో  కూడా వెల్లడైంది.

 ఏసీలో ఎక్కువసేపు ఉండటం వల్ల.. సాధారణ గాలి పీల్చుకో లేకపోతున్నారు ఎంతోమంది. అదే సమయంలో కళ్ళల్లో మంట దురద లాంటి సమస్యలతో కూడా బాధ పడుతున్నారు. ఇక ఏసీ వేసిన సమయంలో చల్లగాలి బయటికి పోకూడదు అనే ఉద్దేశంతో డోర్స్ అన్నీ క్లోజ్ చేయడం వల్ల.. ఆ గదిలో ఆక్సిజన్ తగ్గిపోయి ఇక ఆ తర్వాత అది మైగ్రేన్ గా మారిపోతుందని అంటున్నారు నిపుణులు. ఏసీ వల్ల ఎంతోమంది డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం కూడా ఉందని అంతేకాకుండా చర్మం పొడిబారిపోతుంది అని చెబుతున్నారు. గంటల తరబడి ఏసీలో ఉండటంవల్ల లోబీపీ వచ్చే అవకాశం కూడా ఉంది అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: