బిజెపికి సిఎం బిగ్ షాక్...?

Gullapally Rajesh
జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా సరే ధరల పెంపుదల విషయంలో వెనక్కుతగ్గ లేదంటే మాత్రం ఇబ్బందులు తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికే పెట్రోల్ ధరల విషయంలో సామాన్య ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రులు కూడా భారతీయ జనతా పార్టీ అధిష్టానంపై చాలావరకు సీరియస్ గానే ఉన్నారు. 16 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పరోక్షంగా ప్రత్యక్షంగా పరిపాలన చేస్తున్నది. దీనితో రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇప్పుడు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారనే ప్రచారం జరుగుతుంది.
2024 ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా నాశనం అయ్యే అవకాశాలు కూడా ఉండవచ్చు. ఈ నేపథ్యంలోనే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాస్త జాగ్రత్త పడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే  ఆర్జేడీ అధినేత prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">లాలూ ప్రసాద్ యాదవ్ తో చర్చలు జరుపుతున్నారని సమాచారం. తనకు ప్రాధాన్యత లేదని భావించిన ఆయన ఇప్పుడు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేకపోవచ్చు.
ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో ఆ పార్టీ మెజారిటీ సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు నితీష్ కాస్త జాగ్రత్త పడుతున్నట్లు బీజేపీ వర్గాలు అంటున్నాయి.గెలిచినా సరే తను పూర్తిగా పక్కన పెట్టేస్తారు అని భావించిన ఆయన ఎన్నికలకు ముందే ప్రతిపక్షాలతో కలిసే ఆలోచన చేస్తున్నారట. ఎలాగో ఈ సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ రాకపోయినా సరే ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం లో ఉండే అవకాశం కూడా ఉంది. అందుకే ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలకు ఆసక్తికరంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: