హర్యానా రాష్ట్రము జగన్ ని ఫాలో అవుతోంది..కారణం ఏమిటో...?

VAMSI
ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పేదల సంతోషమే అంతిమ లక్ష్యంగా అన్ని సంక్షేమ పధకాలను ప్రెవేశపెట్టారు. అవి సక్రమంగా ప్రజలకు అందేలా ప్రణాళికను చేశారు. అంతే కాకుండా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగ సమస్యను పారదోలడానికి వాలంటీర్ వ్యవస్థను ప్రవేశ పెట్టి లక్షల మందికి ఉపాధిని కల్పించారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో కంపెనీ యాజమాన్యాలు ఉద్యోగాలకోసం స్థానికేతరులను ఎక్కువగా తీసుకుంటూ ఉండడంతో మనకు ఉద్యోగాల కొరత ఏర్పడింది. అయితే దీనిని రూపుమాపడం కోసం జగన్ సారధ్యంలోని ఏపీ ప్రభుత్వం 75 శాతం రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఇలాంటి బిల్లులు రాజకీయ పరంగా తాత్కాలికంగా లబ్ది చేకూరినా దీర్ఘకాలికంగా దీని వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతానికి అమలులో ఉన్న 50 శాతం రిజర్వేషన్ లకే ఓసీ కులానికి చెందిన వారు ధర్నాలు చేస్తుండడం మనము చూస్తూనే ఉన్నాము. ఎన్నో పోరాటాలు చేసిన తరువాత ఇ డబ్ల్యు ఎస్ వారు కేవలం 10 శాతం రిజర్వేషన్ వరకు పొందగలిగారు. మరొక విషయం ఏమిటంటే ఎవరైనా ఆంధ్రప్రదేశ్ లో కంపెనీలు స్థాపించాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కంపెనీ ని స్థాపిస్తారు, తరువాత వేరొక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ కంపెనీని మూసేస్తుంది. ఈ విధంగా వ్యాపారస్తులను, హాస్పిటల్స్ వారిని, స్కూల్స్ యాజమాన్యాలను ప్రతి ఒక్కరినీ ఏడిపించుకు తింటున్నారు. ఎవరికి అనుకూలమైన వారు అధికారంలో ఉంటే వారికి సానుకూలంగా పనులు జరుగుతాయి. లేదంటే నరకం అనుభవించాల్సిన పరిస్థితి. ఇలాంటి రకరకాల పరిస్థితుల వలన బ్రతకలేక మనము వేరే రాష్ట్రాలకు వెళ్లి బ్రతకాల్సిన పరిస్థితి. ఒకవేళ బయటి రాష్ట్రాలలో కూడా ఉద్యోగాలకి 75 శాతం రిజర్వేషన్ లు కల్పిస్తే అక్కడ ఉన్న మనవాళ్ళకి ఉద్యోగాలు ఎలా వస్తాయి.

ప్రస్తుతం ఇదే విధానాన్ని హర్యానా రాష్ట్రము తాజాగా 75 శాతం రిజర్వేషన్ బిల్లును పట్టుకొచ్చారు. ఈ విషయాన్ని హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా చెప్పారు. దీని నుండి ప్రైవేట్ ఉద్యోగాలలో 75 శాతం స్థానిక యువత ఉద్యోగాలు పొందవచ్చని తెలిపారు. హర్యానా స్టేట్ ఎంప్లాయిమెంట్ అఫ్ లోకల్ కాండిడేట్స్ బిల్లు పేరిట ఈ బిల్లును గతేడాది రూపొందించారు. ఇప్పుడు అమలులోకి తీసుకురావడం జరిగింది. దీనికి గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేశారు. ఈ ఉద్యోగాలకు నెలకు 50 వేలు జీతాన్ని ఉండేలా కేటాయించడం జరిగింది.  ఒకవేళ సంబంధిత ఉద్యోగానికి స్థానికులతో అర్హత లేని యెడల ప్రభుత్వ అనుమతితో వేరే రాష్ట్రాలలోని ఉద్యోగులను నియమించుకునే వెసులుబాటును కల్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: