ప్లమ్ పండ్లు ఎందుకు తినాలో తెలుసా..!?

frame ప్లమ్ పండ్లు ఎందుకు తినాలో తెలుసా..!?

N.ANJI
ప్లమ్ పండ్లు అంటే ఎవరికీ ఎక్కువగా తెలీదు. మన దేశంలో ప్లమ్ పండ్లను అలూ బుఖారా పండ్లు అంటారు. ప్లమ్‌లలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ గుండెకు మేలు చేస్తాయి. విష వ్యర్థాల్ని తొలగిస్తాయి. గుండె సమస్యల్ని తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి గుండెను కాపాడతాయి. ఈ రోజుల్లో చాలా మందికి మలబద్ధకం సమస్య బాగా ఉంటోంది. వారు ప్లమ్ పండ్లను తింటే.. జీర్ణవ్యవస్త మెరుగవుతుంది. మూత్రనాళం బాగా పనిచేస్తుంది.  ప్లమ్‌ ఎంత ఎరుపు, బ్లూ కలర్‌లో ఉంటే అంత మేలు. ఆ కలర్‌లో యాంతోసియానిన్స్ ఉంటాయి. అవి కాన్సర్ రాకుండా కాపాడతాయి. నోటి కాన్సర్, బ్రెస్ట్ కాన్సర్ రాకుండా చేస్తాయి. చిగుళ్లు పాడవకుండా కాపాడతాయి.
రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఈ పండ్లలోని ఐరన్ రక్త కణాల వృద్ధికి తోడ్పడుతుంది. అందుకే మహిళలు వీటిని బాగా తినాలి. ఈ పండ్లలో ఫైబర్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. లివర్‌లో ఉత్పత్తి అయ్యే బైల్ స్రావాలను ఈ ఫైబర్ పీల్చేస్తుంది. అప్పుడు లివర్... తనలో స్టోర్ అయిన కొలెస్ట్రాల్‌ను వాడుకుంటుంది. అలా కొలెస్ట్రాల్ యూజ్ అయ్యి... లివర్‌కి మేలు జరుగుతుంది. చక్కటి కోమలమైన చర్మం కావాలంటే ప్లమ్ పండ్లను తినాలి. ఈ పండ్లు ముడతల్ని నివారిస్తాయి. చర్మ కణాల్ని వృద్ధి చేస్తాయి. యంగ్ ఏజ్‌తో కనిపించాలంటే.. ప్లమ్ జ్యూస్ తాగాలి.
ప్లమ్స్ ఎముకల్ని బలంగా చేస్తాయని చాలా పరిశోధనల్లో తేలింది. ప్లమ్‌లలో బోరాన్ ఉంటుంది. ఇది ఎముకల్ని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. పైగా ప్లమ్‌లో ఫ్లేవనాయిడ్స్, ఫెనోలిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి ఎముకల్ని తిరిగి బాగుచేస్తాయి. గీతలు, గాయాలు, మచ్చల్ని ప్లమ్ పోగొడతాయి. కొత్త చర్మం వచ్చేలా చేస్తాయి. చర్మం చాలా త్వరగా సెట్టవుతుంది. చర్మం అందంగా, సాగేలా చేయగల గుణం ప్లమ్ పండ్లకు ఉంది. నల్ల మచ్చలు, మొటిమలు వంటివి ఉంటే... ప్లమ్ పండ్లను తినడమే.
జుట్టు రాలిపోతోందా? అలా జరగకుండా ఎడ్రినల్ గ్రంధిని రిపేర్ చేయగలవు ప్లమ్స్. వీటిలో ఐరన్ కూడా రక్త ప్రసరణను పెంచి... ఒత్తైన, బలమైన జుట్టు ఏర్పడేలా చేస్తుంది. దగ్గు, జలుబు వంటి రెగ్యులర్‌గా వచ్చే అనారోగ్యాలకు దూరంగా ఉండాలంటే... సైలెంట్‌గా ప్లమ్‌లను తినేస్తూ ఉండాలి. దాంతో ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. ఎప్పుడైనా ఏ వైరస్సైనా దారి తప్పి దగ్గరకు వస్తే... బలమైన ఇమ్యూనిటీ కారణంగా చచ్చిపోతుంది. అలా ప్లమ్‌లు ఎంతో మేలు చేయనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: