వైరల్ వీడియో : చెట్టుపై హోరాహోరీగా తలపడిన చిరుతపులి, నల్ల చిరుతపులి..?
ఇక్కడ ఇలాంటి ఒక వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా చిరుత పులి ని టీవీ లో సోషల్ మీడియాలో ఎప్పుడూ చూస్తూనే ఉంటా. కానీ నల్ల చిరుతపులి కనిపించడం మాత్రం చాలా అరుదు. అదే సమయంలో చిరుతపులులు రెండు దెబ్బలాడుకోవడం చూసి ఉంటాం.. కానీ నల్ల చిరుత మచ్చల చిరుత దెబ్బలాడుకోవడం మాత్రం చాలా మటుకు ఎవరు చూసి ఉండరు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఆ అవకాశం అందరికీ లభిస్తుంది. ఇటీవలే నల్ల చిరుత మచ్చల చిరుత ఒక చెట్టుపై దెబ్బలాడుకోవడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకని ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఒక చెట్టు పై మచ్చలు చిరుత ఎక్కి సేద తీరుతుంది ఇక అదే సమయంలో ఆ చెట్టు దగ్గరికి వచ్చిన నల్ల చిరుత చెట్టు ఎక్కాలి అని డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలోనే ఇక మచ్చలు చిరుత ఉన్న చెట్టు మీదికి నల్ల చిరుత కూడా ఎక్కింది. ఈ క్రమంలోనే చెట్టు మీద రెండు చిరుతపులులు కూడా కయ్యానికి సిద్ధమయ్యాయి. కానీ అంతలో నల్ల చిరుత వెనక్కి తగ్గడంతో చివరికి ఇక ఈ రెండు చిరుత పులుల మధ్యతలెత్తిన గొడవ కాస్త శాంతియుతంగానే ముగిసిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతు ఉండడంతో ఇక ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు అందరూ ఆశ్చర్యపోతున్నారు.