గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల..!?

praveen
విద్యార్థులకు గుడ్ న్యూస్. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక, గిరిజన, బీసీ, జనరల్‌ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఐదో తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ ని విడుదల చేశారు. ఇక ఈ ఏడాది మే 30న అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం నాల్గో తరగతి చదువుతున్న విద్యార్థులంతా ఈ పరీక్షకు అర్హులు. బుధవారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ఏప్రిల్‌ 3లోగా దరఖాస్తు చేసుకోవాలని వీటీజీసెట్‌ చీఫ్‌ కన్వీనర్‌ డాక్టర్‌ ఆర్‌.ఎస్.ప్రవీణ్‌ కుమార్‌ ఓ ప్రకటన ద్వారా తెలిపారు.


ఈ పరీక్షకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మే 30న అర్హత పరీక్ష జరగనుంది. ఇతర సమాచారం కోసం 1800-425-45678 నంబరుకు ఫోన్‌ చేయొచ్చని ఆయన సూచించారు. అందులో సోషల్‌ వెల్ఫేర్‌లో 18,560, ట్రైబల్‌ వెల్ఫేర్‌లో 4,777, బీసీ వెల్ఫేర్‌ సోసైటీలో 20,800, జనరల్‌ వెల్ఫేర్‌ సోసైటీలో 2,800 సీట్లు ఉన్నాయి. విద్యార్థులు పూర్తి వివరాలకు వివరాలకు www.tswreis.in, https://tgcet.cgg.gov.in, https://mjptbcwreis.telangana.gov.in, https://tgtwgurukulam.telangana.in, https://tresidential.gov.in వెబ్ సైట్లను సందర్శించవచ్చునని అధికారులు తెలిపారు.

ఇక తెలంగాణలో టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను పొడిగించినట్లు ప్రభుత్వం తెలిపింది. స్కూళ్ల హెడ్‌మాస్టర్స్, ప్రిన్సిపాల్స్ విజ్ఞప్తి మేరకు పరీక్ష తేదీలను మార్చినట్లు అధికారులు తెలిపారు. ఎస్ఎస్‌సీ, ఓఎస్ఎస్‌సీ, వొకేషనల్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు ప్రభుత్వం సూచించిన తేదీల లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. లేట్ ఫీజు లేకుండా విద్యార్థులు 2021 మార్చి 12 లోగా ఫీజు చెల్లించాలి. విద్యార్థులు చెల్లించిన ఎగ్జామ్ ఫీజును హెడ్‌మాస్టర్స్ 2021 మార్చి 15 లోగా సబ్ ట్రెజరీ ఎస్‌బీఐకి చెల్లించాలి. విద్యార్థులు  డీఈఓ కార్యాలయాల్లో నామినల్ రోల్స్‌ని 2021 మార్చి 16, 17 తేదీల్లో అందజేయాలి. ఇంకెందుకు ఆలస్యం మీరు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలంటే గడువు తేదీలోపు సంబంధిత వెబ్ సైట్ లో సంప్రదించి అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: