షియోమి నుంచి న్యూమొబైల్.... కేవలం 5 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ ....

Suma Kallamadi
ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. వినియోగదారులను తమ వైపుకు ఆకర్శించుకునేందుకు మొబైల్ ఉత్పత్తి సంస్థలను పోటా పోటీగా సరికొత్ ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి యూజర్ స్మార్ట్ ఫోన్లలో కెమెరా, ఛార్జింగ్ పవర్, స్టోరేజీ. ఇక ఇప్పటికే మార్కెట్లోకి వీటన్నింటిని సరికొత్తగా డిజైన్ చేస్తూ ఆయా సంస్థలు సిరీస్ పరంగా స్మార్ట్ ఫోన్లలు విడుదల చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమి స్మార్ట్ ఫోన్ల ఫీచర్స్ లో మరో ముందడుగు వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇంకా ఏంటీ ఆలోచిస్తున్నారా ? షియోమి 200 w ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో  ఓ స్మార్ట్ ఫోన్ ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. అది కూడా ఈ ఏడాదిలోనే లాంచ్ చేయాలని భావిస్తుంది.

తాజా సమాచారం ప్రకారం షియోమి 200W చార్జింగ్ సపోర్ట్ కలిగిన స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చేందుకు షియోమి కసరత్తులు చేస్తుంది. అది కూడా ఫ్లాగ్ షిప్ ఫోన్ల మాదిరిగానే అల్ట్రా మోడల్ వేరియంట్ లాగే ఉండవచ్చని సూచిస్తుంది. అంటే 200w చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే మొబైల్ కు కేవలం 5 నిమిషాలు చారింగ్ పెడితే సరిపోతుంది. ప్రస్తుతం షియోమి బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో కూడా ఫాస్ట్ చార్జింగ్ ను అందిస్తుంది. ఇటీవలే మార్కెట్లోకి 65w ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవే కాకుండా షియోమి యొక్క Mi 10 ఎక్స్ ట్రీమ్ కొమ్మమరేటివ్ ఎడిషన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్, 55W వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటుగా 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో వుంది. ఇప్పటికే 120W ఛార్జర్ ను వివో iqoo7 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయగా.. రియల్ మీ 125w ఫాస్ట్ ఛార్జింగ్ తీసుకోచేందుకు ప్లాన్ చేస్తుంది.  ఇక ఈ స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన పూర్తి వివరాలను షియోమి త్వరలోని ప్రకటించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: