పుర పోరు: ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి షాక్ ఇవ్వనున్నాయా ...?

VAMSI
ఎట్టకేలకు ఏపీలో మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిన్నటితో ముగిశాయి. ప్రజలంతా తమ ఓటు హక్కును సమర్ధవంతంగా వినియోగించుకున్నారు. ఇక తరువాయి భాగం, రాబోయే ఫలితాల కోసం ఎదురుచూపులు మాత్రమే. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు గెలుపు సమీకరణాలపై చర్చల్లో తలమునకలై ఉంటారు. అయితే ఎప్పటిలాగే ఎన్నికలు ముగిశాక ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తమ అంచనాలతో రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ముఖ్యంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకుని దాని అనుగుణంగా ఊహాజనితమైన ఫలితాలను ఇస్తూ ఉంటారు. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు గానీ మరియు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎలక్షన్స్ కు కానీ భారీ ఎత్తున ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు ఇచ్చారు.

కానీ ప్రస్తుతం ఏపీలో జరిగిన మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ సర్వే చేయడానికి ఒకటి రెండు సంస్థలకు మించి ఆసక్తి చూపించలేదు. ఆర్ధిక పరమైన సమస్య కావొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు రెండు సర్వేలు మాత్రమే తమ సర్వేని ఇచ్చాయి ఒకటి నాగన్న సర్వే..ఇది నంద్యాల మరియు వైజాగ్ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనది. ఇంకోటి ఆత్మసాక్షి సర్వే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు. ఆత్మసాక్షి ఇచ్చిన సర్వే ప్రకారం వైసీపీ కి 45.5% ఓట్లు వస్తాయని చెప్పడం జరిగింది. అదే విధంగా టీడీపీ కి 36.5% మరియు భారతీయ జనతా పార్టీ జనసేన లకు 15.5% ఇతరులకు 2.5% ఓట్లు పోలయినట్లు చెబుతోంది. అయితే మొత్తం 75 మున్సిపాలిటీలకు విజయావకాశాలు చూస్తే వైసీపీకి 69-72 మున్సిపాలిటీలు హస్తగతమయ్యే అవకాశముందని ఈ సర్వే చెబుతోంది.

టీడీపీకి 2 - 5 మున్సిపాలిటీలు భారతీయ జనతా పార్టీ - జనసేన మరియు ఇతరులకు 0-1 మునిసిపాలిటీలు మాత్రమే దక్కనున్నాయని అంచనా. ఇచ్చాపురం , తాడిపత్రి, హిందూపురం, చిలకలూరిపేట, వుయ్యూరు, నరసాపురం, నర్సీపట్నం మరియు కొవ్వూరు. ఈ మున్సిపాలిటీలలో కొన్ని ఓట్ల తేడాతో టైట్ ఫైట్ జరిగే అవకాశముంది. ఈ 75 మున్సిపాలిటీల్లో టీడీపీకి విజయావకాశాలు ఉన్న ప్రాంతాలు బొబ్బిలి, మందపేట, పెద్దాపురం ,తాడిపత్రి. ఇంతకు ముందు చెప్పిన టైట్ ఫైట్ జరిగే మున్సిపాలిటీల్లో వైసీపీకి ఇటు టీడీపీకి అవకాశాలున్నాయి. మిగిలిన మున్సిపాలిటీలన్నింటిలో వైసీపీ గెలిచే అవకాశాలున్నాయని ఆ సర్వే తెలిపింది.  అంతే కాకుండా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలలో గణనీయంగా జనసేన పార్టీ మునిసిపాలిటీల్లో వార్డులను చేజిక్కించుకుంటుంది. జనసేన పోటీ చేయడం వలన టీడీపీ 5 నుండి 10 మున్సిపాలిటీలను కోల్పోతుందని వీరి అంచనా. కొన్ని చోట్ల టీడీపీ మరియు జనసేన ల మధ్య వ్యతిరేకేత వలన 7 మునిసిపాలిటీలు వైసీపీకి దక్కే అవకాశముంది. మరి అసలు ఫలితాలు ఎలా ఉండనున్నాయో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: