పుర పోరు: గెలుపుపై వైసీపీ ధీమా కారణాలివే...?
కానీ ఖచ్చితంగా మాత్రం 65 మున్సిపాలిటీలు మరియు 12 కార్పొరేషన్ లు వైసీపీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే విజయవాడ, గుంటురు మరియు వైజాగ్ లలో ఉత్కంఠ పోరు నడిచే అవకాశముందని తెలుస్తోంది. ఇక్కడ వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ వివాదం కారణంగా కొంత ఓటింగు వైసీపీకి తగ్గిందనే చెప్పాలి. దీని కోసం ప్రత్యేకంగా ఈ కార్పొరేషన్ పై దృష్టి పెట్టి వైసీపీ నాయకులు మరియు అధిష్టానం పని చేశారు. మరి ఇక్కడ ఎటువంటి ఫలితం వస్తుందో వేచి చూడాలి. ఇక పోతే గుంటూరు మరియు విజయవాడ లలో గతంలో టీడీపీ గెలిచి ఉంది కాబట్టి...ఇక్కడ కూడా వైసీపీ ప్రత్యేకంగా ప్రణాళికను చేసింది.
డబ్బులు వరద పారించిన సంగతి తెలిసిందే. కేవలం ఈ మూడు కార్పొరేషన్ లకు 30 నుండి 50 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇకపోతే గోదావరి జిల్లాలలో మాత్రం ఒక 5 చోట్ల ఉత్కంఠ పోరు నడుస్తుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. అంతే కాకుండా జనసేన మరియు భారతీయ జనతా పార్టీ పొత్తు వలన కూడా అటు టీడీపీకి ఇటు వైసీపీకి కొంత మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాల సమాచారం. మరి ఏ విధమైన ఫలితం రానుందో చూడాలి.