ఆ స్వీడన్ సంస్థ బయటపెట్టిన రిపోర్ట్.. భారత్‌ పరువు గంగలో కలిపేస్తోంది..?

Chakravarthi Kalyan
భారత దేశానికి ప్రపంచ దేశాల్లో ఓ విశిష్ట స్థానం ఉంది. ప్రపంచంలోనే అతి పెద్దప్రజాస్వామ్య దేశం మనది. ప్రపంచ జనాబాలో రెండో స్థానంలో ఉన్నాం. అందులో చైనాలో ప్రజాస్వామ్యం కానందువల్ల ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అంటే ఇండియానే. బ్రిటీష్‌ వాళ్లు మేం వెళ్లిపోతే మీకు పాలించుకోవడం రాదని హేళన చేసిన పరిస్థితుల నుంచి విజయవంతంగా ప్రజాస్వామ్యం ద్వారా పాలించుకుంటా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది ఇండియా.

అయితే.. తాజాగా ఓ స్వీడన్ దేశం సంస్థ ఇచ్చిన ఓ నివేదిక భారత్‌ పరువు గంగలో కలిపేస్తోంది. ఇంతకీ ఆ సంస్థ ఏమని రిపోర్ట్ ఇచ్చింది. అందులో ఏముంది.. తెలుసుకుందాం.. స్వీడన్‌కు చెందిన విడెం ఇన్‌స్టిట్యూట్‌ ఓ ప్రజాస్వామ్య నివేదికను విడుదల చేసింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లోని ప్రజాస్వామ్య పరిస్థితులపై అధ్యయనం చేసి ఈ రిపోర్ట్ రూపొందించారట. ఆ నివేదికలో భారత్‌ స్థాయిని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కాకుండా.. ఎన్నికల ప్రజాస్వామ్య దేశంగా  పేర్కొన్నారు.

ఇలా ఇండియా స్థాయి తగ్గించడంతో మన పరువు గంగలో కలుస్తోంది.  అమెరికా ప్రభుత్వ నిధులతో పనిచేసే ఈ స్వచ్ఛంద సంస్థ భారత ప్రజాస్వామ్య స్థితిని తగ్గించింది. అందుకు కారణాలు కూడా వివరించింది. 2014 లో మోదీ ప్రధాని అయినప్పటి నుంచి భారత్‌లో రాజకీయ హక్కులు, పౌర స్వేచ్ఛలకు భంగం కలుగుతోందని ఈ నివేదిక వెల్లడించింది. ఇక ఇప్పుడు ఈ నివేదికపై ఇండియాలోనూ రాజకీయం మొదలైంది. ఇలాంటి నివేదిక వస్తే ప్రతిపక్షాలకు పండుగే కదా.

అందుకే భారత్‌ ఇకపై ప్రజాస్వామ్య దేశం కాదంటూ స్వీడిష్‌ ఇన్‌స్టిట్యూట్‌ విడుదల చేసిన నివేదికకు సంబంధించిన వార్తను కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ఆ పోస్ట్‌లో భారత్‌ ఇకపై ప్రజాస్వామ్య దేశం కాదని రాహుల్‌ కోట్ చేశారు. అయితే ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ నివేదిక దేశాన్ని తప్పుదోవ పట్టించేలా ఉందని విమర్శించింది. భారత్‌లో ప్రజాస్వామ్యం ఘనంగా వర్థిల్లుతోందని చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: