మగవారిలో వీర్యకణాల అభివృద్ధికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోండి.. !

Suma Kallamadi
ఈ కాలంలో చాలా మంది సంతాన సమస్యలను ఎదుర్కుంటున్నారు. అయితే పిల్లలు పుట్టాలంటే  భార్య భర్త ఇద్దరులోనూ ఎటువంటి లోపాలు ఉండ కూడదు. మగవారిలో అయితే  వీర్య కణాల సంఖ్య  బాగా తక్కువగా ఉంటే, సంతానం కలగటం కష్టం అవ్వవచ్చు. సాధారణంగా  వీర్య కణాలు  ఒక మిల్లి లీటర్ కి 15 మిలియన్లు ఉంటే ఆరోగ్యాంగా ఉన్నట్టే. అంతకంటే తక్కువగా వుంటే సంతాన  సమస్యలు తలెత్తవచ్ఛు
వీర్యం ఎక్కువగా ఉన్నా, పనికివచ్చే కణాలు, చురుకైన కణాలు లేకపోతే కూడా సంతానోత్పత్తి లో సమస్యలు కలుగవచ్చు. మీరు వీర్య కణాల పరీక్ష చేయించుకుని, అందులో కౌంట్ కానీ నాణ్యత కానీ తక్కువ అనిపిస్తే గనుక  వైద్యుల  చికిత్సతో పాటుగా  మీరు తీసుకునే ఆహరం మీద కూడా ధ్యాస పెడితే ఫలితం త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది.మగవారి విషయంలో వీర్యకణాలు పెంచే మంచి పుష్టికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం గురించి తెలుసుకుందాం. ముందుగా మనం ప్రతి రోజు కూరల్లో వాడే టోమాటోల్లో లైకోపెన్ (lycopene) అనే యాంటీ-ఆక్సిడెంట్ (anti-oxidant) ఉంటుంది. వైజ్ఞానిక పరిశోధనలలో తెలిసినది ఏంటి అంటే టోమాటో జ్యూస్ తాగడం వలన  వీర్యం ఆరోగ్యంగా, చురుకుగా ఉంటుందట.

అలాగే డ్రై ఫ్రూట్స్ అని పిలవబడే వాల్నట్స్ (అక్రోటు కాయ)లో ఒమేగా 3, కొవ్వుతో కూడిన యాసిడ్స్ వున్నాయి. ఆక్రోట్ ను ఆహారంలో భాగంగా తీసుకుంటూ వుంటే అవి వీర్యాన్ని బలంగా తయారు చెయ్యటంలో సహకరిస్తాయి. అలాగే స్పెర్మ్  కౌంట్ కి కావాల్సిన అమినో ఆసిడ్, ఫైటో స్టిరాల్స్ (phytosterols) గుమ్మడి గింజల్లో బాగా ఉన్నాయి. వీర్యం మోతాదు పెంచడానికి, వీర్య కణం నాణ్యతని పెంచడానికి ఇవి బాగా సహకరిస్తాయి. రోజూ వీటిని సలాడ్స్ మీద కానీ, ఉట్టిగా కానీ, పప్పుధాన్యాలతోనో తింటే మంచిది.మరిన్ని ఆహార పదార్ధాలను తదుపరి ఆర్టికల్ లో చూద్దాం.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: