సహజీవనం ఓకే.. కానీ అలా అస్సలు కుదరదు.. హైకోర్టు కీలక తీర్పు..?

praveen
ఈ మధ్యకాలంలో కోర్టులు  ఊహించని విధంగా తీర్పు ఇస్తూ అందరినీ ఒక్కసారిగా షాక్కి గురి చేస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రకాల షాకింగ్ తీర్పులతో ప్రజలందరూ ఆశ్చర్యపోయిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. పంజాబ్ హర్యానా హైకోర్టు ఇలాంటి ఒక తీర్పు ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ప్రభుత్వాలు కుల మతాంతర వివాహాలు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి  అనే విషయం తెలిసిందే. ప్రజల మధ్య కుల మతం అనే భేదం లేకుండా అందరూ సమానమే అనే ధోరణి తీసుకురావడానికి ఇక ప్రభుత్వాలు ఎక్కువగా మతాంతర కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ ఉన్నాయి.


 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇక్కడ ఒక హైకోర్టు మాత్రం కీలక తీర్పు ఇవ్వడం ఆసక్తికరంగా మారిపోయింది. ఇటీవలే ఒక హిందూ పురుషుడు ముస్లిం యువతి ప్రేమించుకున్నారు.  ఎన్నో రోజుల పాటు ప్రేమించుకున్న వీళ్ళు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ విషయం ఇంట్లో చెబితే ఇక పెద్దలు తమ పెళ్లికి అంగీకరించరు అని భావించి ఇక ఇంట్లో చెప్పకుండానే రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు భయం భయంగానే గడిపారు. ఇక తమ కుటుంబీకులు  ఎక్కడ దాడి చేస్తారో అని భయపడి ఇక రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించినప్పటికీ పోలీసులు మాత్రం వారి మోర  ఆలకించలేదు.


 ఈ క్రమంలోనే ఏకంగా పంజాబ్ హర్యానా హైకోర్టు లో ఒక పిటిషన్ వేశారు ఈ జంట. పిటిషన్ పై విచారణ జరిపిన పంజాబ్ హర్యానా హైకోర్టు కీలక తీర్పు నిచ్చింది. హిందూ పురుషుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం మహిళ  మతం మారే వరకు ఆ పెళ్లి చెల్లదు అంటూ స్పష్టం చేస్తోంది. ఇక ముస్లిం యువతి మతం మార్చుకుని హిందువుగా మారినప్పుడు మాత్రమే వివాహం చెల్లుబాటు అవుతుంది అంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.  అప్పటివరకు వివాహం చేసుకున్నప్పటికీ అది చెల్లదు అంటూ తెలిపింది. అయితే ఇద్దరు మేనేజర్లు కావడం తో సహజీవనం చేసుకోవడానికి మాత్రం అవకాశం ఉంది అంటూ పంజాబ్ హర్యానా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: