జర ఇటు కూడా సూడుండ్రి...

హైదరాబాద్: నీలం రంగు తుఫాన్కు ఒక ఆంధ్ర ప్రాంతమే కాదు, తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాలో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందనీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట తారాక రామారావు అన్నారు. తెలంగాణ జిల్లాలో 80శాతం వరకు చేతికి వచ్చిన పత్తి పంట నీట మునిగిందన్నారు. కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే పంటలు నీటి పాలయ్యాయనీ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ మొదలుకుని చంద్రబాబు, విజయమ్మ అందరూ ఆంధ్ర ప్రాంతానికి పర్యటనకు వెళ్లారనీ తెలంగాణ ప్రాంతంలో దెబ్బ తిన్న పంటల్ని పరిశీలించడానికి, ఇక్కడి రైతులను పరామర్శించడానికి ఎవరూ రాకపోవడం పట్ల రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంత ప్రజల బాధలు, కష్టాల్ని ఏనాడూ సీమాంధ్ర ప్రాంత ప్రజా ప్రతినిధులు పట్టించుకోరన్నారు.  సీమాంధ్ర ప్రాంత నేతలందరూ తెలంగాణ ప్రాంత ప్రజల్ని ద్వితీయే శ్రేణి పౌరులుగా చూస్తున్నారనీ చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేమీ కావాలన్నారు. సీమాంధ్ర ప్రాంత నాయకులకు తెలంగాణ ప్రాంతమన్నా, తెలంగాణ ప్రజలన్నా వారికి చిన్న చూపు అని మరోమారు తేలిపోయిందన్నారు. నీలంరంగు తుఫాన్ వల్ల నష్టపోయిన పంటల్ని కనీసం అధికారులైనా సందర్శించి నష్టపరిహారం నివేదికను ప్రభుత్వానికి అందచేయాలన్నారు. ఎకరా పత్తికి 30వేల రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వాలనీ రామారావు డిమాండు చేశారు.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: