తానా ఎన్నికలు – ఒక విశ్లేషణ
తానా ఎన్నికలు
ఎక్కడోపుట్టి ఎక్కడో పెరిగి మనమంతా ఈ దేశానికి వచ్చాం.
ప్రతీ అద్భుత శక్తి తనతో పాటు బృహత్తర బాధ్యతలు కూడా మోసుకొస్తుంది.అలాగే ఈ ఓటు అనేఆయుధం కూడా తనతో విచక్షణ అనే సమున్నత బాధ్యత సహితంగా సామాన్యుడి చేతికి వస్తుంది.కాబట్టి ఓటరు మహాశయులారా.. మీ ఓటు ఎంతోవిలువైనది. అది ఒక సంస్థ దిశానిర్దేశాన్నిశాసించగల ఒక అపురూపమైన నాయకత్వాన్ని మన సంస్థకు అందిస్తుంది. అంతటి విలువైనఓటును సద్వినియోగంచేసుకోండి. మీ బాలట్ పత్రాలను దయచేసి ఎవ్వరికీ ఇవ్వకండి. ఎక్కడోపుట్టి ఎక్కడో పెరిగి మనమంతా ఈ దేశానికి వచ్చాం. మన ఓటును మనం సద్వినియోగంచేసుకోవడం ద్వారా తెలుగు జాతి కీర్తి పతాకను విదేశాల్లో సైతం సగర్వంగా రెప రెపలాడేలాచెయ్యగలం. మరో తెలుగు తేజం ఉవ్వెత్తున ఎగసేలా చెయ్యగలిగిన సత్తా ఇప్పుడు మనకురాబోతోంది. ఒక స్వచ్చమైన నాయకత్వాన్ని ఎవరైతే మనకు అందించగలరో అలాటి వారినే మనంఎన్నుకొందాం. అలాంటి వారు ఎవరనేది మనం నిర్ణయించుకొందాం. మన నిర్ణయంలో ఇతరులుజోక్యం చేసుకోకుండాచూద్దాం. మన మనసుకు నచ్చిన, మనకు సంపూర్ణంగా విశ్వాసమున్న వారినేఎన్నుకొందాం. మన సంస్కృతినీ, మన వారసత్వాన్ని సగర్వంగా మనం భావి తరాలకు అందిద్దాం.ప్రపంచ పటంలో తెలుగు జాతికి సాటి మరోటి లేదని చాటి చెబుదాం.
ఓటు మన హక్కు
Krishna Prasad Alapati, Voice :+001 248 854 3145