బాబు మనసులో ఆ ఆలోచన ఉందా..?!!
నందమూర తారక రామారావు 1982 లో తెలుగు వారి కోసం స్ధాపించిన పార్టీ తెలుగు దేశం పార్టీ (టీడీపీ). నాటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ఎప్పటికప్పడు అన్ని రాజకీయ పార్టీలతో పోటీ పడుతూ వస్తుంది. ఎన్టీఆర్ మరణించిన తర్వాత ఆ పార్టీ పగ్గాలు నారా చంద్రబాబు నాయుడు చేపట్టాడు. నాటి నుంచి నేటి వరకు ఆయనే టీడీపీ అధ్యక్షులుగా ఉంటూ వస్తున్నారు. మరి ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి పదవి చేపట్టి బీజీ షెడ్యూల్ లో ఉన్న ఆయన తన హోదాను మార్చుకొనే పనిలో పడ్డారు. నారా లోకేష్ రాజకీయం పై మంచి పట్టు సాధించేలా ప్రయత్నాలు మొదలు పెట్టారు. అంతే కాదు తనయుడిని ప్రమోట్ చేసుకోవడం గురించి బాబు కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టుగా తెలుస్తోంది.