రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడిన ప్రభుత్వాలు గద్దెదిగడం రాజకీయ చరిత్రలో ఎన్నో చూశాం. రైతుల కన్నీటి ఉసురు ప్రభుత్వాలు గద్దెదిగడం కోసం కారణమవుతున్నప్పటికిని రైతుల గూర్చి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పొలాల్లో పనిచేసుకుంటూ ఉండాల్సిన రైతులు విత్తనాలు, యూరియా కోసం పోలిస్ స్టేషన్ల ఆవరణలో క్యూలో నిలబడి తెచ్చుకొనే పరిస్దితి ఏర్పడింది. విత్తనాలను కొనుగోలు చేసే సమయం మొదలుకొని పంటలు మార్కెట్లో విక్రయించే వరకు రైతులు అడుగడుగున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండకు ఎండి, వానకు తడ్చి సేదదీరుదామనుకున్న రైతన్నలు యూరియా కోసం వెళ్లి పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. రైతులకు విత్తనాల ఎంపిక నుండి పంటలకు రోగాలు సోకితె ఏ విధంగా రక్షించుకోవాలనే బాధ, విధ్యుత్ కోతతో అల్లాడుతున్న రైతన్నల సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికిని పరిష్కార దిశగా చర్యలను ఎందుకు చేపట్టడం లేదనేది ఇప్పుడు పాలకుల ముందున్న ప్రశ్న. అన్ని చూసిన రైతు ఓనిజమైన సామెత చెప్పాడు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడలేదని చెప్పాడు. బాష కొంచెం యాసగా ఉన్నప్పకిని చరిత్రను తిరిగేస్తే అర్ధం అయ్యేది అదే... హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుగాంచిన చంద్రబాబు కూడా విధ్యుత్ చార్జీలను పెంచడంతో పాటు అందుకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారిని పోలీస్ కాల్పుల్లో చనిపోవడానికి కారణమై చివరకు గద్దెదిగిపోయారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా రైతు సంక్షేమం పేరుతో గద్దెనెక్కిప్పటికిని రైతు వ్యతిరేక విధానాలకే పాల్పడుతుందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కనీసం యూరియా, విత్తనాలు కొనుగోలు చేస్తామన్నప్పటికిని క్యూలో నిలబడే పరిస్థితి ఉందంటే సర్కారు పనితనం అట్లే అర్ధం అవుతుంది. దీంతోనే సమస్య పరిష్కారం కావడం లేదు. యూరియా కోసం బారులు తీరిన రైతులు గంటల పాటు క్యూలో నిలబడి వారి బాధలను వ్యక్తం చేస్తుంటే పోలీస్ కేసులు నమోదవుతున్నాయి. వ్యవసాయానికి పేరుగాంచిన ఈ రాష్ర్టంలోనే వ్యవసాయం గూర్చి రైతులు ఇన్ని బాధలు పడుతుంటే పరిష్కార దిశగా ప్రయత్నాలు ఎందుకు సాగడం లేదనేది పాలకులకే తెలియాలి. వర్షాలు లేక, భూగర్గజలాలు అడుగంటిపోయి బ్రతుకు బండిని లాగుతున్నటువంటి రైతన్నలను అర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించడం కోసం పరిష్కారం ఆలోచించాల్సిన అవసరముంది. సమయానికి అందని సబ్సీడీలు, రైతు చైతన్య యాత్రలు రైతులను అర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించలేవనే విషయాలను పాలకులు గుర్తించాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: