ఛీ.. ఛీ.. సభ్య సమాజం తలదించుకునే పని చేసిన కామాంధుడు..

Satvika
కామాంధులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. వావి వరుసలు పూర్తిగా మర్చిపోయి, చిన్న,చితక, ముసలి అనే తారతమ్యాలు లేకుండా కామ కోరికలు తీర్చుకోవాలని కనిపించిన వారిని పట్టుకొని విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. మృగాలుగా మారుతున్నారు. దారుణాలకు ఒడిగడుతున్నారు. చట్టాలు ఎన్ని చేసినా, కఠిన శిక్షలు ఎన్ని అమలు చేసినా మృగాల్లో మార్పు కనిపించడంలేదు. ఏదో ఓచోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పత్తికొండ మండలం పందికోనలో శుక్రవారం జరిగిన అవమానవీయ ఘటన సభ్యసమాజం తలదించుకొనేలా ఉంది.

వైకాపా కార్యకర్త గోమారీ కాశీ ఇంటెదురుగా నివాసం ఉంటున్న చిన్నారి పై అఘాయిత్యానికి యత్నించాడు. మధ్యాహ్నం పిల్లలతో దాగుడు మూతలు ఆడుకుంటూ  ఉన్న చిన్నారిని మాయమాటలు చెప్పి నమ్మించి ఇంట్లోకి తీసుకెళ్లారు. చిన్నారి ముందు బట్టలు విప్పి చెండాలంగా ప్రవర్తించారు. ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అదే సమయానికి మరి కొందరు పిల్లలు అక్కడికి చేరుకోవటంతో అమ్మాయిని వదిలేశాడు. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీసి ఇంట్లోకి వెళ్లి ఒక మూలానా కూర్చున్న చిన్నారిని గమనించిన తల్లి ఆరా తీసింది.

జరిగిన విషయం తల్లికి పూస గుచ్చినట్లు ఆ చిన్నారి వివరించింది. కత్తితో బెదిరించినట్లు చెప్పింది. ఇంత చేసిన ఆ ఘనుడు ఏమీ ఎరగనట్లు చిన్నారి తల్లి వద్దకు వెళ్లి నీ కూతురు ఏమైనా నీతో చెప్పిందా అని అడగడం, అంతలోనే విషయం చుట్టు పక్కల వారికి తెలియటంతో అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. జరిగిన విషయంపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం కర్నూలుకు పంపనున్నట్లు ఆయన తెలిపారు. తాజాగా నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు పంపనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: