కరోనా పరీక్షలు కొత్త పద్ధతిలో.. ఎలాగో తెలుసా..?

praveen
ప్రశాంతంగా సాగిపోతున్న ప్రపంచాన్ని మొత్తం... ప్రాణ భయంతో వణికించి  ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది చైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా వైరస్.  మొదట్లో ఈ వైరస్ ప్రాణాంతకమైన వ్యాధి కాదు అని అనుకున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం ఎంతో మంది ప్రాణాలను తీసేంతవరకు వెళ్ళింది. ఆ తర్వాతే ఈ వైరస్ ఎంత డేంజర్అని తెలిసింది. వైరస్ గురించి చైనా దాచిన నిజాలకు ప్రపంచం బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.  అయితే కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఇక ఈ మహమ్మారి వైరస్ ను కంట్రోల్ చేసేందుకు అన్ని దేశాల ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు కూడా చేశాయి అన్న విషయం తెలిసిందే.



 అయితే ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ వైరస్ ప్రభావం మాత్రం తగ్గలేదు. రోజురోజుకు మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతూ ఉండడంతో అక్కడి ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. అయితే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి కూడా ఎన్నో రకాల పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి అనే విషయం తెలిసిందే. కొన్ని పరిశోధనలు ఈ వైరస్కు వ్యాక్సిన్ కనుగొనేందుకు జరుగుతూ ఉంటే.. మరి కొన్ని పరిశోధనలు ఈ మహమ్మారి వైరస్ ను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇక ఈ వైరస్ మూలాలను కనుక్కోవడం పై జరుగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.



 ఇప్పుడు వరకు కరోనా వైరస్ పరీక్షలు గొంతు ముక్కు లోని తెమడతో చేశారు అన్న విషయం తెలిసిందే. ఇకనుంచి కొత్త విధానంలో కరోనా వైరస్ పరీక్షలు చేయనున్నారు. చర్మం నుంచి వచ్చే జిడ్డు కొవ్వు  పదార్థాన్ని పరీక్షించి కరోనా  నిర్ధారిత పరీక్షలు చేయనున్నారు. ఇటీవలే బ్రిటన్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాన్ని కనుగొన్నారు. ప్రస్తుతం మనిషి చర్మం పై ఉన్న కొవ్వు జిడ్డు  పదార్థంతో  పరీక్ష నిర్వహించడానికి ఒక సరికొత్త పద్ధతిని కనుగొన్నామని దీనిని మరింత మెరుగు పరిస్తే కచ్చితమైన ఫలితాలు రాబట్టేందుకు అవకాశం ఉంది అని చెప్పుకొచ్చారు శాస్త్రవేత్తలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: