శోభనం కోసం ఫ్లెక్సీలు వేసిన వరుడు..వైరల్..!

Satvika
శోభనం అనేది పెళ్ళైన కొత్త జంట మొదటి కలయిక.. పెళ్లికి ప్లెక్సీలు వేసి ఘనంగా వివాహం చేసుకున్న వారిని  చాలా మందిని చూసి ఉంటారు.. కానీ శోభనానికి కూడా ప్లెక్సీలు వేసి ఆహ్వానించాడు ఓ వరుడు.. ఇది వినడానికి వింతగా ఉంది కదా.. అయినా ఇది నిజమే.. వివరాల్లోకి వెళితే.. ఇప్పటివరకు కు పెళ్లికి ఊరంతా ఫ్లెక్సీలు వేసుకోవడం చూసి ఉంటారు.. శోభనం కోసం ఫ్లెక్సీలు వేయడం ఎప్పుడైనా చూశారా..వినటానికి వింతగా ఉన్నా.. ఇది నిజమేనండి.. , ఓ యువకుడు మాత్రం శోభనం కోసం ఎన్నాళ్ల నుంచి వేచి చూస్తున్నాడు ఏమో.. యుద్ధానికి సిద్ధం అంటూ ఏకంగా ఫ్లెక్సీలు వేసి మరీ ప్రచారం చేసుకుంటున్నాడు.. ఇప్పుడు ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఇది నిజంగా విడ్డూరమే.. భార్యా భర్తల మధ్య జరిగే ఏకాంత సమయాన్ని ఇలా చేయడం పై పలువురు విమర్శలు కూడా గుప్పించారు.ఆ ప్లెక్సిలో ఏముందో ఒకసారి చూడండి..


నేటితో నా బ్రహ్మచారి జీవితానికి సంప్రదాయబద్ధంగా స్వస్తి పలికి ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న తొలిరేయి అనుభవానికి
తహ తహ లాడుతూ
యుద్ధానికి సిద్ధమైన బాహుబలి వలె
ఈరోజు జరిగే రాత్రి యుద్ధాన్ని
ముహూర్త సమయానికి ప్రారంభించి అతి తక్కువ సమయంలోనే
నా తల్లిదండ్రులను నానమ్మ తాతయ్య లను
చేస్తానని అంతఃకరణ శుద్ధి తో ప్రమాణం చేస్తున్నాను”.. అంటూ రాయించాడు.


రావులపాలెం లో ఫస్ట్ నైట్ సంబరాలు.. మొదలైన కొత్త సంస్కృతి’ పేరుతో ఈ ఫ్లెక్సీ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పోస్టర్ ను నెటిజన్లు లైక్ లు , షేర్ లతో పాటుగా విపరీతంగా కామెంట్లు కూడా చేస్తున్నారు.అయితే ఈ పోస్టర్ ఎక్కడిదనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.. యుద్ధం నువ్వు చేస్తే ఊరంతా ప్రచారం ఎందుకు బాబు అని కామెంట్లు చేస్తున్నారు.. కొందరయితే ఆ బాబు బాగా కరువుతో ఉన్నాడు కాబోలని సెటైర్లు పేలుస్తున్నారు.. ఇతని పోస్టర్ ఆధారంగా ఇంకా ఎన్ని రకాల పోస్టులు చూడాల్సి వస్తుందో చూడాలి అంటూ సదరు అభిప్రాయ పడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: