మోడీ తీసేస్తే ఏంటీ.. మేము కొనసాగిస్తాం.. కేసిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..?

praveen
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త సాగు చట్టాలపై ఇప్పటికి కూడా  చర్చ కొనసాగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే.  కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు చేస్తున్న నిరసనలు రోజురోజుకు ఉదృతంగా మారిపోతూనే ఉన్నాయి అనే విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త సాగు చట్టాలను రద్దు చేసి ఎంతవరకు  ఉద్యమాన్ని ఆపేది లేదు అంటూ రైతు సంఘాలు భీష్మించుకు కూర్చుని  నిరసనలు ఆందోళనలు చేస్తున్నాయి.



 ఇకపోతే మొన్నటి వరకూ కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవసాయ సాగు చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ ఆ తర్వాత మాత్రం మద్దతు ప్రకటించారు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట్లో వ్యవసాయ సాగు చట్టాల పై విమర్శలు చేసినప్పటికీ ఆ తర్వాత మాత్రమే వ్యవసాయ చట్టాలకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాము అంటూ చెప్పడం చర్చనీయాంశంగా మారిపోయింది ఈ క్రమంలోనే కేసీఆర్ ప్రభుత్వం పై అటు ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి కూడా.



 కొత్త సాగు చట్టాల ప్రకారం రైతులు తాము పండించిన పంటను నేరుగా ప్రభుత్వానికి అమ్మేందుకు అవకాశం ఉంటుంది  మధ్య దాళారుల  మోసాలు లాంటివి ఉండవు. ఇటీవల సీఎం కేసీఆర్ కొత్త వ్యవసాయ చట్టాల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం వ్యవసాయ మార్కెట్ లాను తొలగించినా  తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వ్యవసాయ మార్కెట్ లను  కొనసాగిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. పంట  కొనుగోళ్లు  కొనసాగుతాయని గిట్టుబాటు ధర ప్రకటిస్తాము అంటూ తెలిపారు. ఎఫ్సీఐ ఏకంగా 80 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది అంటూ ఈ సందర్భంగా గుర్తు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: