టీడీపీకి కమ్మవారు చేసిన ద్రోహం గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..?

Chakravarthi Kalyan
విజయవాడ అంటే కొండపైన అమ్మవారు.. కొండ కింద కమ్మవారు.. అని ఓ సినిమాలో డైలాగ్ ఉంది. విజయవాడలో కమ్మ సామాజికవర్గం డామినేషన్ ఆ రేంజ్‌లో ఉంటుందని చెబుతారు. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే.. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి కమ్మ సామాజిక వర్గం డామినేషన్ సంగతి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే.. అప్పట్లో ఎన్టీఆర్ వంటి నాయకులు కమ్మ సామాజిక వర్గం వారే అయినా.. అన్ని సామాజిక వర్గాలను ప్రత్యేకించి బీసీ వంటి సామాజిక వర్గాలను కలుపుకుని వెళ్లారు. రాజకీయాల్లో విజయం సాధించారు.

అయితే మొన్నటి విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ నుంచి ఓ వింత పోకడ కనిపించింది. ఈ ఎన్నికల్లో మొత్తం 14 స్థానాల వరకూ కమ్మ వారికి కేటాయించారు. వారిలో దాదాపు పది మంది వరకూ విజయం సాధించారు కూడా. సాధారణంగా నిష్పత్తి చూసుకుంటే ఇది చాలా మంచి విజయమనే చెప్పాలి. అయితే అసలు చిక్కు ఎక్కడ వచ్చిందంటే.. కమ్మవారికి కాకుండా మిగిలిన సామాజిక వర్గాలకు ఇచ్చిన చోట్ల ఆ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఇలా ఎందుకు జరిగిందా అని విశ్లేషణ చేసుకుంటే ఓ షాకింగ్ వాస్తవం వెలుగు చూసింది.

అదేంటంటే.. కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చిన చోట్ల ఆ సామాజిక వర్గం వారు విజయం కోసం బాగా కష్టపడ్డారు. అందుకే 14 సీట్లు ఇస్తే పది గెలుచుకున్నారు.  కానీ ఆ సామాజిక వర్గానికి కాకుండా బీసీలకు ఎస్సీలకు ఇచ్చిన చోట్ల తెలుగు దేశం గెలుపు కోసం కమ్మ సామాజిక వర్గం వారు ఏమాత్రం కృషి చేయలేదన్నది ఇప్పుడు వినిపిస్తున్న విశ్లేషణ. గెలుపు కోసం కృషి చేయడం సంగతి అటుంచి.. కనీసం పోలింగ్ బూత్ వరకూ వచ్చి ఓటు కూడా వేయలేదట చాలా చోట్ల.

అంటే పోటీలో ఉన్న ది తమ పార్టీ అభ్యర్థి అయినా సరే.. అతడు కమ్మ కులస్తుడు కాకపోతే గెలిపించేందుకు కమ్మ కులస్తులు పెద్దగా ప్రయత్నించ లేదన్నమాట. అంటే పార్టీ కంటే సామాజిక వర్గమే ఇక్కడ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ఇది చాలా ప్రమాదకరమైన వైఖరి అంటున్నారు విశ్లేషకులు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: