విశాఖ ఉక్కు వివాదంపై తీర్మానం అప్పుడే...?
అయితే ఇప్పుడు వైజాగ్ ప్రాంతం ప్రజలు అన్ని ఆశలు అసెంబ్లీ సమావేశాలపైనే పెట్టుకుంది. ఎందుకంటే అసెంబ్లీ లో దీనిపై చర్చ జరిపి రాష్ట్ర పరిధిలో మనం చేయగలిగినంత వరకు ఈ ప్రైవేటీకరణను ఆపడానికి చూడాలి. కానీ ఇప్పటికే తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు పెట్టడం, బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగిపోయాయి. ఏపీలో కూడా ఈ పాటికే నిర్వహించాల్సింది. కానీ ఆగిపోయిన ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ల ఎన్నికల కోసం ఆగినట్లు సమాచారం. ఇదే సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక డిమాండును వినిపించారు. దీనిని అసెంబ్లీలో తీవ్రంగా ఖండించి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశంపై తీర్మానం చేయాలి అని చెప్పారు. దీనిపై కొద్ది రోజుల క్రితమే వైజాగ్ స్టీల్ పై అసెంబ్లీ సమావేశాలలో ఖచ్చితంగా తీర్మానము చేస్తామని ప్రకటించారు.
అయితే తీర్మానంలో ఏ అంశం ఉండాలి అనేది ముఖ్యం. ఈ తీర్మానంలో విశాఖను మా రాష్ట్రానికే వదిలేయండి. మేమే నిర్వహించుకుంటాము. ఎటువంటి పరిస్థితుల్లో దీనిని ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు అని గట్టిగా కేంద్రానికి తెలిసేలా ఒక సొల్యూషన్ రాసి పంపాలి. దీనిపై పలువురు రాజకీయ వేత్తలు ఈ వైజాగ్ స్టీల్ అంశాన్ని రాజకీయం చేయకుండా మన రాష్ట్రము చేజారనీయకుండా కాపాడుకోవడమా మన బాధ్యత అని చెబుతున్నారు. మరి చూద్దాం రానున్న అసెంబ్లీ సమావేశాలలో ఏమి జరగనుందో.