అండమాన్‌ దీవుల్లో అద్భుత నగరం.. మోడీ ప్లాన్ అదిరిపోయిందిగా..!?

Chakravarthi Kalyan
అండమాన్ మరియు నికోబార్ దీవులు.. ప్రశాంత వాతావరణం లో కొద్ది రోజులు ఆనందంగా గడపాలనుకునేవారికి అద్భుత ప్రశాంతత ఇస్తాయి. ఈ అండమాన్ మరియు నికోబార్ దీవులు బంగాళాఖాత సముద్రంలో ఉన్నాయి. ఇవి మొత్తంగా 600 దీవులు. వీటిలో చాలా వరకు మ్యాపు లలో కనపడవు. ఇప్పుడు ఈ అండమాన్ దీవుల్లో మోడీ సర్కారు ఓ నగరాన్ని నిర్మించాలని తలపెట్టింది.
నగరం అంటే ఏదో అల్లాటప్పా కాదండోయ్..ఏకంగా హాంగ్‌కాంగ్, సింగపూర్‌లను తలదన్నే రేంజ్‌లో అన్నమాట.


ఈ నిర్మించబోయే నగరంలో మానాశ్రయాలు, స్టార్ హోటళ్లు, హాస్పిటళ్లు, స్పా  సెంటర్లు, రిసార్టులు, కన్వెన్షన్ సెంటర్లు.. ఒకటేమిటి ఎన్నో హంగులు ఉంటాయట. ఈ అండమాన్ దీవులను  టూరిస్ట్ హబ్‌ చేయాలనేది మోడీ సర్కారు ప్లాన్. దీనికోసం కార్పొరేట్ కంపెనీలతో మాట్లాడుతోంది కేంద్రం. కొద్దిరోజుల క్రితం నీతిఆయోగ్ ‘లిటిల్ అండమాన్- ఓ సుస్థిర అభివృద్ధి’ పేరిట కాన్సెప్ట్ పేపర్ కమ్ విజన్ డాక్యుమెంట్ కూడా రెడీ చేసింది.


మరి కేంద్రానికి అకస్మాత్తుగా ఈ ఆలోచన ఎందుకు వచ్చింది.. ఇది కేవలం టూరిజం కోసం కాదు.. కేవలం టూరిజం కోసం అయితే కేంద్రం ఇంత ప్లాన్ ఎందుకు చేస్తుంది.. దీని వెనుక దేశ రక్షణ ఉంది.  దేశరక్షణ రీత్యా అత్యంత కీలకమైన మలక్కా జలసంధి ఈ అండమాన్ దీవులకు  దగ్గరలో ఉంటుంది. ప్రపంచ సముద్ర రవాణాకు కీలకమైన మార్గం ఇది. ఈ ప్రాంతంపై పట్టు కోసం ఇప్పడు చైనా ప్రయత్నిస్తోంది. అందుకే చైనా ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు ఇండియా ఇక్కడ వ్యూహాత్మకంగా  సైనిక స్థావరాలు నిర్మించబోతోంది.


అందుకే కటీ రెండు దీవుల్లో బాగా టూరిజం  యాక్టివిటీని పెంచబోతున్నారు. మిగిలిన దీవుల్లో నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, మిస్సైల్స్ కంబైన్డ్ యూనిట్లను మొహరిస్తారు. దేశ భద్రత రీత్యా ఈ ప్రణాళిక రూపొందిస్తున్నారు.  ఇండియా భద్రతకు, హిందూ మహాసముద్రంపై ఇండియా ఆధిపత్యానికి సవాళ్లు విసిరే చైనా ముత్యాలసరం ప్రాజెక్టుకు ఇండియా రూపొందిస్తున్న రియాక్షన్ ప్లాన్ ఇదే. అందుకే అండమాన్ దీవులు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: