అలా చేసారా.. ఇక రేషన్ కార్డు రద్దవ్వటం ఖాయం..?
ఈ క్రమంలోనే రేషన్ కార్డు లబ్ధిదారుల విషయంలో జరుగుతున్న అవకతవకలకు చెక్ పెట్టే విధంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ ముందుకు సాగుతుంది. కాగా ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. కొత్త రేషన్ కార్డు తీసుకునేవారికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక రకంగా షాక్ అనే చెప్పాలి. ఒకవేళ రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులు మూడు నెలల వరకు రేషన్ బియ్యం తీసుకోకుండా ఉంటే ఇక ఆటోమేటిగ్ గా ఆ రేషన్ కార్డు రద్దు అవుతుంది అని మంత్రి గంగుల కమలాకర్ ఇటీవల స్పష్టం చేశారు.
అంతే కాదు ఎన్నో రోజుల నుంచి నిలిచిపోయిన రేషన్ కార్డు ప్రక్రియ గురించి కూడా మంత్రి గంగుల కమలాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ అంటూ తెలిపిన మంత్రి గంగుల కమలాకర్ కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ రావడంతోనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఆగిపోయింది అంటు తెలిపారు. కొత్త తెల్ల రేషన్ కార్డు కోసం 9 లక్షల 41 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అసెంబ్లీ వేదికగా ఇటీవలే మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.త్వరలో వీటి జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు.