బ్లేడ్‌తో గర్భిణీకి ఆపరేషన్ చేసిన 8వ తరగతి చదివిన వ్యక్తి.. చివరికి..!?
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజారామ్ అనే వ్యక్తి గర్భిణీ అయిన తన భార్య పూనమ్‌ను ప్రసవం కోసం ఒక మంత్రసాని దగ్గరకు తీసుకెళ్లాడు. అయితే ఆ మంత్రసాని ఆమెను డీహ్ ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించమని సూచించింది. అక్కడ పూనమ్‌ను పరిస్థితిని చూసిన నర్సు.. పరిస్థితి విషమంగా ఉందని వెంటనే ఆమెను పెద్దస్పత్రికి తీసుకెళ్లమని సలహా ఇచ్చింది. దీంతో అతడు రాజేష్‌కు చెందిన నర్సింగ్ హోమ్‌లో చేర్పించారు.
అక్కడ అనుభవం లేని రాజేంద్ర శుక్లా పూనమ్‌కు చికిత్స అందించాడు. ఆపరేషన్ చేసేందుకు రేజర్ బ్లేడ్ వాడాడు. దీంతో పూనమ్‌కు గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. అనంతరం ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించమని అక్కడివారు తెలిపారు. వెంటనే రాజారాం ఆమెను లక్నోలోని ఆసుపత్రికి కు తరలించాడు. అయితే తీవ్ర గాయాలతో బాధపడుతున్న ఆమె అక్కడ చికిత్స పొందుతూ మరణించింది.
అయితే సమీపంలో ఆస్పత్రులు లేకపోవడంతో రాజారామ్ తన భార్యను 140 కిలోమీటర్ల దూరంలో లక్నోలోని కెజిఎంయూకు తరలించాడు. అయితే తీవ్ర గాయాలతో బాధపడుతున్న ఆమె అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. ఈ సంఘటనపై రాజారామ్ ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే మరణించిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారించిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి.
ఇక రాజేశ్ సహనీ అనే వ్యక్తి పేరు స్థానిక ఆసుపత్రిలో రిజస్ట్రర్ చేయకుండా, మౌలిక సదుపాయాలు లేకుండా నిర్వహిస్తున్నాడు. అందులో పనిచేసేందుకు రాజేంద్ర శుక్లా అనే వ్యక్తిని నియమించుకున్నాడు. ఇతగాడు ఎనిమిదో తరగతి చదివి డ్రాప్ అవుట్ అయ్యాడు. ఎటువంటి జాగ్రత్తలు లేకుండా, అనుభవం లేకుండా బ్లేడ్‌తో ఆపరేషన్ చేసి ఇద్దరు ప్రాణాలను పొట్టనపెట్టుకున్నాడు. రాజారామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు రాజేంద్ర శుక్లా, రాజేష్ సాహ్నిపై కేసు నమోదు చేశారు.