ఏపీలో ఇసుకరేట్లు భారీగా పెరిగిపోతున్నాయా..?

Deekshitha Reddy
నూతన ఇసుక విధానం ద్వారా ఏపీలో ఇసుక అమ్మకాలను జేపీ గ్రూప్ దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) నిర్వహించిన టెండర్లలో.. రాష్ట్రంలో ఇసుక తవ్వకం, నిల్వ, అమ్మకం వ్యవహారాలను ఢిల్లీకి చెందిన జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (జేపీ పవర్‌) సొంతం చేసుకుంది. ఏడాదికి గాను ఈ సంస్థ అత్యధికంగా 765కోట్ల రూపాయలు కోట్ చేసింది.

ప్రస్తుతం అమల్లో ఉన్న ఇసుక విధానంలో ప్రభుత్వానికి 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.161.30 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు రూ.380 కోట్ల ఆదాయం లభించింది. జేపీ పవర్ కి ఈ పనులు అప్పగించడం ద్వారా టెండర్ల ద్వారా 765 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది. అంటే ఆదాయం గణనీయంగా పెరుగుతోందనమాట. ఈ లెక్కన చూసుకుంటే ఈ ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు జేపీ పవర్ ఇసుక అమ్మకాల ద్వారా అంతకంటే ఎక్కువ ఆదాయం సంపాదించాలి. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే కచ్చితంగా ఇసుక రేట్లు పెంచాల్సిందే.

మారబోతున్న విధానం..
ఇసుక రీచ్ ల వద్దే స్టాక్‌ యార్డ్‌ ఏర్పాటు చేస్తుండటంతో నేరుగా ర్యాంపుల దగ్గర ఇసుక నాణ్యతను పరిశీలించి నచ్చిన రీచ్‌లో డబ్బు కట్టి రసీదు తీసుకునే అవకాశం ఉంది. అక్కడే కావాల్సినంత ఇసుకను మనం తెచ్చుకున్న వాహనంలో తీసుకెళ్లొచ్చు. లేదా అక్కడే అందుబాటులో ఉన్న వాహనాల్లో అయినా తరలించుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రీచ్‌ వద్ద ఒకే ధర ఉండేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఎక్కడైనా అధిక ధరలకు అమ్మితే ఫిర్యాదు చేయడానికి కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇసుక అమ్మకాల్లో సిఫార్సులకు చోటుండకూడదని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆన్ లైన్ దరఖాస్తులుండవు. వినియోగదారులు నేలుగా ర్యాంపుల వద్దకు వెళ్లి ఇసుకను కొనుగోలు చేయవచ్చు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు అనుములు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓపెన్‌ రీచ్ లలో మాత్రమే తవ్వకాలకు అనుమతి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: