ప్రాణాలు తీసేందుకు మరో మహమ్మారి దూసుకొస్తోంది.. భయం గుప్పిట్లో జనాలు..?
ఇక ఆ తర్వాత ఆయా దేశాల ప్రభుత్వాలు వైరస్ ను కంట్రోల్ చేసేందుకు ఎంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడంతో కరోనా వైరస్ ప్రభావం కాస్త తగ్గింది. ఇకపోతే కరోనా వైరస్ ప్రభావం తగ్గింది అని అందరూ సంతోష పడుతున్న తరుణంలో మనుషుల ప్రాణాలు బలి తీసుకోవడానికి ఎన్నో రకాల కొత్త మహమ్మారి వ్యాధులు దూసుకు వస్తూనే ఉన్నాయి. ఒక వ్యాధి పోయింది అని సంతోషపడే లోకి మరో వ్యాధి దూసుకువచ్చి ఎంతోమంది ప్రాణాలను హరిస్తుంది. అయితే ఈ ఇటీవలే ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గింది అని అనుకుంటున్న సమయంలో.. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాను ఎలుకల ప్లేగు వ్యాధి వణికిస్తోంది.
ఆస్ట్రేలియా లో భారీ సంఖ్యలో ఎలుకలు ప్లేగు వ్యాధి బారిన పడుతూ ఉండడం అక్కడి ప్రజలందరినీ కూడా బెంబేలెత్తిస్తోంది. తాజాగా గిల్ గ్రండా లోని ఓ ప్రాంతంలో ఉన్న పొలంలో ఏకంగా వేల సంఖ్యలో ఎలుకలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పరుగులు తీస్తు కనిపించడం ఆసక్తికరంగా మారిపోయింది. ఇక భారీ సంఖ్యలో ఎన్నికలు పరిగెడుతుంటే భూమి అదిరి నట్లుగా అనిపిస్తుందని ఏకంగా భూకంపం వచ్చినట్లు తాము భయపడ్డాము అంటూ స్థానికులు చెబుతూ ఉన్నారు. అయితే దీనికి ఎప్పుడు చెక్ పడుతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయారు.